బాలీవుడ్ లో అవకాశాల కోసం చాలా మంది హీరోయిన్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇతర భాషల్లో వరుసగా హిట్స్ వస్తే చాలు చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్ వైపు చూస్తూ ఉంటారు. అక్కడ ఒక్క అవకాశం వచ్చి ఒక్క హిట్ వచ్చినా లేదా స్టార్ హీరోతో ఒక్క సినిమా చేసినా సరే వాళ్ళ రేంజ్ పెరిగిపోతుంది. హిట్ కాకపోయినా యావరేజ్ టాక్ వచ్చినా చాలు. ఆ హీరోయిన్ దశ తిరిగిపోవడం ఖాయం. ఇది పక్కన పెడితే ఇప్పుడు బాలీవుడ్ లోకి వెళ్లేందుకు గాను ఇక్కడ స్టార్ హీరోయిన్ తక్కువ సినిమాలకే అయిపోయిన  పూజాహెగ్డే ప్రయత్నాలు చేస్తుంది. 

 

అక్కడ ఒక్క అవకాశం వస్తే చాలు అనుకుంటుంది ఆమె. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస హిట్స్ రావడం తో అటు చూస్తుంది. ముంబై లో తనకు గతంలో ఉన్న పరిచయాలతో ఆమె సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ లో ఆమె కు పారితోషకం ఇచ్చే స్థాయిలో కూడా నిర్మాతలు లేరు అనేది వాస్తవం. ఇది పక్కన పెడితే ఇప్పుడు అక్కడి నిర్మాతలకు, హీరోలకు ఆమె ఒక ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. తనకు అవకాశం ఇస్తే చాలు కొన్ని కొన్ని ఇబ్బంది పడను అంటుంది. 

 

లిప్ లాక్ అయినా, బికినీ సీన్ అయినా, కథ డిమాండ్ చేస్తే బోల్డ్ సీన్ అయినా సరే నటిస్తాను అంటుంది. ఇక ఎక్కువ డిమాండ్ చేయను ఖర్చులను అర్ధం చేసుకుంటాను అని చెప్తుంది ఈమె. హ్రితిక్ రోషన్ తో ఒక సినిమా కూడా చేసింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీనితో ఆమె కు అవకాశం ఇవ్వాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. మరి ఆమెకు ఏ విధంగా అవకాశాలు వస్తాయి అనేది చూడాలి. ప్రస్తుతం ఇక్కడ ప్రభాస్, అఖిల్ తో ఒక్కో సినిమా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: