టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి మన తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. కొన్నేళ్ల క్రితం మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన శ్రీ అనే సినిమాతో టాలీవుడ్ కి నటిగా పరిచయం అయిన తమన్నా, ఆ తరువాత శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో అక్కడి నుండి తమన్నాకు మెల్లగా అవకాశాలు పెరిగాయి. ఇక ఆ తరువాత నుండి ఒక్కోక్కటిగా ఛాన్స్ లు అందుకుంటూ ముందుకు సాగిన తమన్నా, నేడు టాలీవుడ్ లోని అగ్ర నటీమణుల్లో ఒకరుగా ఎదిగింది. 

 

ఇక ప్రస్తుతం కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా అలానే అక్కడక్కడా ప్రత్యేక గీతాల్లో కూడా నటిస్తున్న తమన్నా, ఇటీవల సూపర్ స్టార్ మహేష్ హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ తో కలిసి డ్యాంగ్ డ్యాంగ్ అనే సాంగ్ లో చిందేసి ప్రేక్షకులకు మంచి వీనుల విందు అందించింది. ఇక ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో తన సినీ, వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకునే తమన్నా, నేడు కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో ఒక చాట్ సెషన్ ని నిర్వహించింది. ఇక ఆ చాట్ లో భాగంగా కొందరు ఫ్యాన్స్ పవన్, మహేష్ ల గురించి మీ అభిప్రాయం ఏంటని అడుగగా. 

 

తనకు వారిద్దరూ అంటే ఎంతో ఇష్టం అని చెప్పిన తమన్నా, చాలా గ్యాప్ తరువాత మహేష్ తో కలిసి సరిలేరు లో స్పెషల్ సాంగ్ చేయడం ఎంతో సూపర్బ్ ఎక్స్ పీరియన్స్ అని, ఇక పవన్ కళ్యాణ్ నేటి యువతకు రియల్ ఇన్స్పిరేషన్ అని చెప్పడం జరిగింది. ఇక తమ తమ హీరోలను గురించి మిల్కీ బ్యూటీ చెప్పిన మాటలతో ఒక్కసారిగా అటు మహేష్, ఇటు పవన్ ఫ్యాన్స్ ఇద్దరూ కూడా ఆనందోత్సహాల్లో తేలియాడుతూ తమన్నా కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ మ్యాటర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: