ఒకప్పుడు తెలుగు లో ‘అమృతం’ సీరియల్ వస్తుందంటే చాలు టివిలకు అతుక్కుపోయేవారు.  ప్రస్తుతం జబర్ధస్త్ ని ఎంతగా ఇష్టపడేవారో.. అప్పట్లో అమృతం సీరియల్ వస్తుందంటే చాలు చిన్నా పెద్దా టివి ల ముందు కూర్చొని తెగ ఎంజాయ్ చేసేవారు.  ఇందులో అమృతం, అంజి, సర్వం చేసే అల్లరి అంతా ఇంతా కాదు.  వీరి చేసే తెలివి తక్కువ పనులు స్క్రీన్ పై చూస్తుంటే కడుపుబ్బానవ్వుకునే వారు.  ఈ సీరియల్‌ మొదటగా 2001లో ప్రారంభమైంది. 2001 నుంచి జెమిని టీవీలో ప్రసారమైయేది. 313 ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకున్న తర్వాత... 'మా' ఛానల్‌కు వెళ్లింది. ఇలా ఈ సీరియల్‌ అన్ని ఛానళ్లలోనూ ప్రసారమైంది.   ప్రసారం చేసినపుడల్ల ఈ సీరియల్‌కు భారీ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేవి.  ఎపుడు ప్రసారం చేసినా.. ‘అమృతం’ సీరియల్‌కున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ సీరియల్‌ను  కొంత మంది ప్రేక్షకులు యూట్యూబ్ వేదికగా చూస్తూనే ఉన్నారు.

 

ఈ సీరియల్‌లో శివనారాయణ, శివాజీ రాజా, హర్షవర్ధన్‌, నరేష్‌ రాగిని, సుప్రజా, నర్సింగ్‌ యాదవ్‌ తదితరులు యాక్టింగ్‌ చేశారు. ఈ సీరియల్‌ మొత్తం కామెడీతో సాగుతుంది.  హోటల్‌ చుట్టే... రోజుకో కథాంశంగా సీరియల్‌ సాగుతుంది. ఐతే ఈ సీరియల్‌ కొన్ని రోజులు ప్రసారమై.. ఆగిపోవడంతో ప్రేక్షకులు నిరుత్సాహ పడ్డారు. ఐతే వారికి ఒక గుడ్‌ వచ్చేసింది.  గంగరాజు , సందీప్‌ సంయుక్తంగా లైట్‌ బాక్స్‌ మీడియా బ్యానర్‌ లో ఈ ఉగాదికి అంటే 25 మార్చిన నవ్వించడానిక తీసుకు వస్తున్నారు. 

 

అయితే  అంజి పాత్రలో కనిపించిన గుండు హనుమంతరావు మరణించటంతో ఆ ప్లేస్ లో ఎల్బీ శ్రీరామ్ ని తీసుకున్నారు.  ఇక గతంలో ఉన్న నాలుగు క్యారెక్టర్లు (అమృతం, అంజి, సర్వం, అప్పాజీ)  ఆధారంగానే మన మనసులకు హత్తుకునే విధంగా ఉండబోతుందట.  అందరూ సంతోషంగా వీక్షించే  అమృతం సీరియల్‌ మళ్లీ మొదలవుతుంది. మార్చి 25 నుంచి జీ-5లో మొదలు కాబోతుంది.  ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: