అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా అతను సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే తాజాగా విజయ్ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఎన్నో అంచనాలతో వచ్చింది. భారీ విజయం సాధిస్తుందని భావించారు అందరూ. కాని బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా బొక్క బోర్లా పడింది. ఊహించని పరాజయంతో దర్శకుడు క్రాంతి మాధవ్ కూడా షాక్ అయ్యారు. ఇప్పట్లో ఆయన ఆ షాక్ నుంచి బయటకు వచ్చేలా కనపడటం లేదు. 

 

ముఖ్యంగా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి విజయ్ కారణమని అంటున్నారు. విజయ్ చేసిన అతి వలనే ఈ సినిమా ఫ్లాప్ అయింది అనేది కూడా జనాల మాట. విజయ్ దేవరకొండ కథలో అనవసరంగా వేలు పెట్టడం సినిమాకు పెద్ద మైనస్ అయింది అంటున్నారు. తనకు ఉన్న ఇమేజ్ కి తగిన విధంగా కథను మార్చుకున్నాడు విజయ్. అలాగే తనకు నచ్చిన విధంగా సీన్లు, ప్రచారం ఉండే విధంగా జాగ్రత్త పడ్డాడు. కనీసం క్రాంతి మాధవ్ కూడా వినలేదని అతను ఎన్ని సార్లు చెప్పినా సరే తనకు నచ్చిన విధంగానే మార్చుకున్నాడు అంటున్నారు. 

 

విజయ్ కి ఇప్పుడు చేతిలో మూడు నుంచి నాలుగు సినిమాలు ఉన్నాయి. కాని క్రాంతి మాధవ్ విషయంలో మాత్రం అది పూర్తీ భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా హిట్ అయితేనే అవకాశాలు వస్తాయి. దీనితో ఇప్పుడు క్రాంతి మాధవ్ తీవ్ర నిరాశలో ఉన్నాడు. మంచి లవ్ స్టోరీ లు చేసాడు క్రాంతి మాధవ్. అతను చేసిన రెండు సినిమాలు అయితే ఎన్ని సార్లు చూసినా చూడాలని ఉంటాయి. కాని ఈ సినిమా తర్వాత మాత్రం అతనిపై హీరోలకు అభిప్రాయం మారుతుంది అంటున్నారు. ఏది ఎలా ఉన్నా వేలు పెట్టి నాశనం చేసాడు విజయ్ అనే అభిప్రాయమే అతన్ని వేధిస్తుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: