టాలీవుడ్ సినిమాల విషయంలో కొన్ని కొన్ని విషయాలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంలో అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే సినిమాలు ఇప్పుడు కొన్ని వర్గాలకే పరిమితం అవుతున్నాయి. సినిమా కథ ఒకరికి నచ్చితే మరొకరికి నచ్చడం లేదు. ఒకరు బాగుంది అంటే మరొకరు బాగాలేదు అంటున్నారు. తాజాగా మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమా విషయంలో ఇదే జరిగింది. ఆ సినిమా బాగుంది అని ఒక వర్గం అంటే అసలు బాగాలేదు అని మరో వర్గం అనడం ఆశ్చర్యం కలిగించింది. సినిమా వసూళ్లు సాధించింది కాబట్టి హిట్ అన్నారు. 

 

అల వైకుంఠపుర౦ సినిమా కూడా అన్ని వర్గాలకు నచ్చింది. టాలీవుడ్ లో ఇలాంటివి ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. బాహుబలి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ సినిమా కొందరికి నచ్చింది కొందరికి నచ్చలేదు. దీనితో ఇప్పుడు దర్శకులు నరకం చూస్తున్నారట. అసలు ఎలాంటి కథలు రాయాలో అర్ధం కాక తల పట్టుకునే పరిస్థితి రచయిత లకు కూడా వచ్చింది. ముందు సినిమా ఒకరికి నచ్చకపోతే దాన్ని మౌత్ పబ్లిసిటీ చేస్తూ నాశనం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, మహేష్ బాబు సినిమాల విషయంలో ఇదే ఎక్కువగా జరిగింది. 

 

ఈ సినిమాలు బాగాలేదని మౌత్ పబ్లిసిటీ చేయడం కొంప ముంచింది అనే చెప్పుకోవచ్చు. టాలీవుడ్ దర్శకులు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు, మౌత్ పబ్లిసిటీ వలన వసూళ్లు తగ్గుతున్నాయి. పైరసీ కంటే ప్రమాదకరంగా మారిపోయి ఇబ్బంది ఇబ్బంది పెట్టేస్తుంది. కథల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని వర్గాలు కావాలని ఈ విధంగా ప్రచారం చేస్తూ వస్తున్నాయి. సినిమా అంటే ప్రాణం పెట్టి తీసేది. కొంత మంది దర్శకులు వ్యక్తిగత జీవితాలను కూడా త్యాగం చేస్తూ ఉంటారు. అలాంటిది ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం అనేది దర్శక నిర్మాతలకు ఇబ్బందికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: