టాలీవుడ్... స్టార్ డాటర్స్ లో నిహారిక ఒకరు. నాగబాబు కుమార్తె అయిన నిహారిక ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా సరే ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు లేక ఇబ్బంది పడుతుంది. తనకంటూ ప్రత్యేక బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఈ అమ్మాయికి మాత్రం అవకాశాలు పెద్దగా రావడం లేదనే చెప్పాలి. కొన్ని సినిమాలు చేసినా సరే ఈమెకు మాత్రం గుర్తింపు రాలేదు. అన్నయ్య వరుణ్ తేజ్ ఏమో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ కొడుతున్నాడు. ఈమెకు మాత్రం అలాంటి అవకాశం ఇప్పటి వరకు రాలేదు. 

 

వచ్చినవి చిన్న సినిమాలు అవి కూడా ఫ్లాప్ అయ్యాయి. ఒకమనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యాకాంతం తదితర చిత్రాల్లో ఆమె నటించినా సరే గుర్తింపు రాలేదు. కనీసం అవి హిట్ సినిమాలు కూడా కాదు. దీనితో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది ఈ అమ్మాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో నిహారికా షర్టు బటన్ తీసి కాస్త స్కిన్ షో చేసింది. దీనితో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె అవకాశాల కోసమే అలా చేస్తుంది అంటూ కొందరు కామెంట్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. 

 

ఇక ఇప్పుడు ఈ అమ్మాయి, పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో పట్టుచీర కట్టి, సాంప్రదాయ బద్ధంగా నిండైన వస్త్రాలు ధరించి ‘నేను నమ్ముతున్న దానికే అసలు విలువ’ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఫోటోలు పోస్ట్ చేసింది. కొంత మంది ఈ అమ్మాయిని బుట్టబొమ్మ అంటే మరి కొందరు అడ్వాన్సు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నిహారిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా అందంగా ఉన్నావని, ఇలా కంటిన్యు చెయ్యాలని, అవకాశాల కోసం దిగజారే అవసరం నీకు లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: