యాంకర్ ఉదయభాను గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తన వాక్ చాతుర్యం, చురుకుదనంతో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుంది ఈ భామ. వాస్త‌వానికి పదోతరగతి చదువుతుండగా మొట్టమొదటగా కెమెరా ముందుకు వచ్చింది ఉదయభాను. ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి అనే కార్యక్రమంలో ప్రేక్షకులవద్దకు వెళ్ళి వారితో సరదాగా మాట్లాడించడం ఆ షో ప్రధాన ఉద్దేశం. అయితే యాంకర్ అనే పదానికి అర్థం తెలియకపోయినా.. ఉదయభాను మాత్రం గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. మ‌రియు స్మాల్ స్క్రీన్‌కు గ్లామర్ నేర్పిన ముద్దుగుమ్మ ఈమె.  

 

ఇప్పుడంటే అన‌సూయ‌, ర‌ష్మి గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తున్నారు కానీ టీవీ తెరపై ఆనాడే సెగ‌లు పుట్టించింది ఉద‌య‌భాను. ఓ సమయంలో ఈమెను మించిన యాంకర్ తెలుగులో లేదనుకునే స్థాయిలో రెచ్చిపోయింది. సుమ కనకాల ఫామ్‌లోకి వచ్చిన తర్వాత ఉదయభాను ఫేడ్ అవుట్ అయిపోయింది. సినిమాల్లో కూడా నటించి మెప్పించాలనుకుంది కానీ అది వర్కవుట్ కాలేదు. దాంతో పాటు యాంకరింగ్‌కు కూడా దూరమైపోయింది. ఇక ఆ  తర్వాత విజయ్ కుమార్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. మ‌రియు క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే ఇటీవ‌ల మళ్ళీ పలు షోలు చెయ్యడం మొదలు పెట్టిన ఉదయభాను ఇప్పుడు స్టార్ మా లో ఒక సరికొత్త షో ద్వారా కనిపించబోతున్నారు. 

 

చిన్న పిల్లలకు మరియు వారి తల్లికి ఉన్న అనుబంధాన్ని వ్యక్తపరుస్తూ అలాంటి అనుబంధం మీ పిల్లలతో ఉంటే అలాంటి తల్లులకు ``సూపర్ స్టార్ మామ్`` అనే ఈ సరికొత్త షో ద్వారా ఉదయభాను వెల్కమ్ చెప్తున్నారు. అలాగే ఈ షోలో పాల్గొనాలి అంటే తల్లి వయసు 25 నుంచి 30 ఏళ్ళు అలాగే పిల్లల వయసు 5 నుంచి 10 వరకు ఉన్నట్టయితే ఓ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వమన్నారు. ఇక ఈ సరికొత్త షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను గమనించినట్టయతే మంచి ఎమోషనల్ గా ఉందని చెప్పాలి. మ‌రి ఎంత వ‌ర‌కూ ఈ షో హిట్ అవుతుందో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: