మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న సంగతి తెలిసిందే. సైరా తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా చిరు కొరటాల శివ మొదలు పెట్టాడు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ తో పాటుగా మ్యాట్నీ మూవీస్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమాను 90 రోజుల్లో పూర్తి చేసి ఈ ఇయర్ దసరాకు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ సినిమాలో చిరు నక్సలైట్ గా నటిస్తాడని కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి. అయితే వాటిని నిజం చేస్తూ షూటింగ్ స్పాట్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.

 

నక్సలైట్ లుక్ లో చిరు సీరియస్ గా కనిపిస్తున్న లుక్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఈ లుక్ లో చిరు చాలా ఇంటెన్స్ తో కనిపిస్తున్నారు. తన 150 సినిమాల్లో చిరంజీవి ఇలాంటి పాత్రలో నటించలేదని చెప్పాలి. పదేళ్ల గ్యాప్ తర్వాత ఖైది నంబర్ 150తో తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిన మెగాస్టార్ కొరటాల శివతో క్రేజీ మూవీ చేస్తున్నారు. చేసేది కమర్షియల్ సినిమా అయినా అందులో ఓ సామాజిక అంశాన్ని ప్రస్థావించే కొరటాల శివ చిరు సినిమాలో కూడా అలాంటి కథతో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

 

ఈ మూవీలో చిరు డ్యుయల్ రోల్ లో నటిస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మరో స్పెషల్ థింగ్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా సినిమాలో కనిపిస్తారట. చిరు యంగ్ ఏజ్ రోల్ లో చరణ్ సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. చెన్నై భామ త్రిష హీరోయిన్ గా సెలెక్ట్ అయిన ఈ సినిమాలో రెజినా కూడా ఓ స్పెషల్ సాంగ్ కోసం నర్తిస్తుందని తెలుస్తుంది. కోకాపేట రంగస్థలం సెట్ లోనే ఈ సినిమా కోసం రెండు కోట్ల భారీ సెట్ ఏర్పాటుచేశారట. రెండు నెలల పాటు నిరంతరాయంగా ఈ సినిమా షూటింగ్ జరపాలని చిరు ఆర్డర్ వేసినట్టు తెలుస్తుంది. ఈ వయసులో కూడా చిరు స్పీడ్ ను చూసి అందరు షాక్ అవుతున్నారు. లీకైన ఈ పిక్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది.. హీరోల క్యాలిబర్ కు తగినట్టుగా కథలు రాసుకునే కొరటాల శివ మెగాస్టార్ తో ఎలాంటి మెస్మరైజ్ మూవీ దించుతాడో అని మెగా ఫ్యాన్స్ అంతా ఎక్సయిటింగ్ గా ఉన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: