మహేశ్ బాబు మళ్లీ కన్ ఫ్యూజన్ లో పడ్డాడు. ఈ బిజినెస్ మేన్ ను రౌండప్ చేస్తే కన్ ఫ్యూజన్ లో ఎలా పడితే అలా కొట్టేస్తాడు. ఇక రియల్ లైఫ్ లో కూడా తికమకకు గురవుతాడు. అదెప్పుడో తెలుసా..దర్శకుడు బౌండెడ్ స్క్రిప్ట్ తో రాకపోతే కన్ ఫ్యూజన్ కు గురై.. అవసరమైతే సినిమా క్యాన్సిల్ కూడా చేసుకుంటాడు. 

 

మహేశ్ ఆ మధ్య వరుస ఫ్లాపులతో దెబ్బ మీద దెబ్బ తిన్నాక తన కెరీర్ పై ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఎంతటి సక్సెస్ పుల్ డైరెక్టర్ అయినా.. బౌండెడ్ స్క్రిప్ట్ తో రావాలి. అది ఆయనకు నచ్చాలి. ఈ రెండు జరిగితేనే.. డేట్స్ ఇస్తున్నాడు. లేదంటే.. దర్శకుడినే మార్చేస్తున్నాడు మహేశ్. 

 

మహర్షి సినిమా తర్వాత మహేశ్ సుకుమార్ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ లెక్కల మాస్టారు చెప్పిన కథ మహేశ్ కు నచ్చలేదు. రెండు మూడు కథలు రెడీ చేసినా.. వర్కవుట్ కాలేదు. ఈలోగా అనిల్ రావిపూడి చెప్పిన కథ నచ్చడం.. పూర్తి స్క్రిప్ట్ రావడంతో.. వెంటనే బల్క్ డేట్స్ ఇచ్చేసి సరిలేరు నీకెవ్వరు చేశాడు మహేశ్. 

 

సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్ మహర్షి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లైన్ నచ్చడంతో స్క్రిప్ట్ రెడీ చేయనున్నాడు. అయితే.. నచ్చేలా స్క్రిప్ట్ రాకపోవడంతో.. మార్పులు చేర్పులు చేయాల్సిందిగా సూచించాడు మహేశ్. వంశీ మహేశ్ కు నచ్చే కథ ప్రిపేర్ చేయకపోతే.. సుకుమార్ మాదిరి ఈ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. 

 

మహేశ్ కు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ చాలా మంది ఉన్నా.. వంశీ పైడిపల్లితో ఉన్న అనుబంధం మాత్రం ప్రత్యేకం. మహేశ్ ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్స్ కు వంశీ పైడిపల్లి ఫ్యామిలీ అప్పుడప్పుడూ వెళ్తూ ఉంటుంది. ఒకరి ఇంట్లో జరిగే ఫంక్షన్ లో మరొకరు పాల్గొంటారు. ఈ ఇద్దరి మధ్య హీరో.. దర్శకుడి అనుబంధమే కాదు.. అంతకు మించి ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇంతటి అటాచ్ మెంట్ ఉన్నా.. ప్రెండ్ షిప్.. ఫ్రెండ్ షిప్పే. సినిమా సినిమానే. స్క్రిప్ట్ దగ్గరకొచ్చే సరికి మహేశ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. నచ్చితేనే ఓకే చేస్తాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: