హారిక హాసిని బ్యానర్ కు తోడుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ ను స్టార్ట్ చేసిన తరువాత వరసగా సినిమాలు నిర్మిస్తూనే వున్నారు. ప్రేమమ్ జస్ట్ హిట్ అనిపించుకుంది. బాబు బంగారం దెబ్బ తీసింది. శైలజరెడ్డి అల్లుడు గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఇక నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ డబ్బులు సరిపోలేదు. రణరంగం సినిమా ఇచ్చిన షాక్ హీరో శర్వానంద్ కి మాత్రమే కాదు నిర్మాణ సంస్థకి దారుణమైన లాస్ ని తిసుకు వచ్చింది.

 

ఇలాంటి సమయంలో సితార సంస్థను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించిన సినిమా భీష్మ. మారుతి, సుధీర్ వర్మ లాంటి సక్సస్ ఫుల్ డైరెక్టర్ కూడా సితార సంస్థని ఊబిలో నుంచి బయటకి తీసుకు రాలేకపోయారు. కానీ రెండో సినిమాతోనే వెంకీ కుడుముల సేఫ్ జోన్ లో సినిమాని తెరకెక్కించి సూపర్ అనిపించుకున్నాడు. ఇక సితారలో అందరికన్నా ఎక్కువ రెమ్యూనిరేషన్ తీసుకుంది డైరెక్టర్ మారుతి. కానీ హిట్ ఇచ్చి నిర్మాతలని ఆదుకోలేపోయాడు. 

 

పాతిక కోట్ల వరకు ఖర్చు చేసిన భీష్మ పది కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో విడుదలవడం ఆసక్తికరమైన విషయం. ఇప్పుడు ఈ సినిమా కనుక 40 కోట్ల మార్కుకుచేరుకోగలిగితే ఖచ్చితంగా సితార కు పెద్ద సినిమా భీష్మ అవుతుంది. ఇదిలా వుంటే తొలి రోజు నితిన్ సినిమా ఆరు కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇది కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. తెలుగు రాష్ట్రాల అమ్మకాలు 18 కోట్ల వరకే. ఈ లెక్కన మొదటి మూడు రోజుల్లోనే చాలా వరకు బయ్యర్లు సేఫ్ జోన్ కు వెళ్లిపోవడం గ్యారెంటీ. నితిన్ కు, సితారకే కాదు, వెంకీ కుడుముల కు కూడా ఈ సక్సస్ గొప్ప సక్సస్ అని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే సితార సంస్థకు మారుతి, సుధీర్ వర్మ, చందు మొండేటి, ఇవ్వలేని కమర్షియల్ హిట్ వెంకీ కుడుముల ఇచ్చాడు.    

మరింత సమాచారం తెలుసుకోండి: