యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ ఇటీవల విడుదలై డిజాస్టర్ టాక్ ను రాబట్టుకున్న విషయం తెలిసిందే. దాంతో వారం రోజులు కూడా కాకముందే ఈ సినిమాను దాదాపు అన్ని థియేటర్ల లో నుండి తీసివేయడంతో థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్లే. ఇక ఫుల్ రన్ లోఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 9.09 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి నిర్మాత కేఎస్ రామారావును నిండా ముంచింది.
ఇదిలావుంటే గత ఏడాది
డియర్ కామ్రేడ్ తో డిజాస్టర్ ను చవిచూసిన
విజయ్ తాజాగా ఫేమస్ లవర్ తో అంతకు మించిన డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు.
డియర్ కామ్రేడ్ ఓపెనింగ్స్ అయినా రాబట్టింది కానీ ఫేమస్ లవర్ మాత్రం ఫుల్ రన్ లో సింగిల్ డిజిట్ షేర్ కు పరిమితమై
విజయ్ మార్కెట్ ను ఘోరంగా దెబ్బతీసింది. ఈ చిత్రం తరువాత
విజయ్ ప్రస్తుతం
పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు.
.
ఫేమస్ లవర్ క్లోజింగ్ కలెక్షన్స్ :
నైజాం - 3.60 కోట్లు
సీడెడ్ - 0.70 కోట్లు
ఉత్తరాంద్ర - 0.75 కోట్లు
గుంటూరు - 0.62 కోట్లు
కృష్ణా - 0.50 కోట్లు
నెల్లూరు - 0.27 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్ = 7.29 కోట్లు
కర్ణాటక +రెస్ట్ ఆఫ్ ఇండియా = 0.75 కోట్లు
ఓవర్సీస్ - 1.05 కోట్లు
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా షేర్ = 9.09 కోట్లు