చిన్నప్పుడే బాలనటుడిగా పలు సినిమాల్లో హీరోగా నటించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పెరిగి పెద్దయ్యాక రాజకుమారుడు సినిమాతో హీరోగా మారి ఫస్ట్ మూవీ తో బెస్ట్ హిట్ అందుకున్నారు. ఇక ఆ తరువాత యువరాజు తో కూడా మరొక విజయాన్ని అందుకున్న మహేష్ కు ఆపై వచ్చిన వంశి సినిమా పెద్ద ఫ్లాప్ ని అందించింది. అనంతరం వచ్చిన మురారి హిట్ అవ్వగా, టక్కరి దొంగ సినిమా పర్వాలేదనిపించింది. 

 

ఇక ఆ తరువాత బాబీ ఫ్లాప్ ని మూటగట్టుకోగా, అనంతరం గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినాని టాలీవుడ్ కి పరిచయం చేసింది. ఆపై వచ్చిన నిజం, నాని సినిమాలు పెద్దగా ఆడలేదు, వారి తరువాత వచ్చిన అర్జున్ యావరేజ్ విజయాన్ని అందుకోగా, దాని తరువాత వచ్చిన అతడు సూపర్ హిట్ కొట్టింది. ఇక అదే సమయంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ నటించిన పోకిరి సినిమా అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ ని సాధించి మహేష్ బాబుకి అత్యద్భుతమైన క్రేజ్, మార్కెట్ ని తెచ్చిపెట్టింది. 

 

ఇక పోకిరి సినిమా సక్సెస్ కు పూరి మార్క్ డైలాగ్స్, సూపర్ స్టార్ మహేష్ వండర్ఫుల్ యాక్షన్ తో పాటు మహేష్ డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ వంటి వాటిపై పూరి పెట్టిన శ్రద్ధ కూడా కొంత కారణం అనే చెప్పాలి. అప్పటివరకు ఉన్న హెయిర్ స్టైల్ ని మార్చి కొంత లాంగ్ హెయిర్ తో కనపడిన మహేష్ పై అమ్మాయిలు మరింతగా మనసు పారేసుకున్నారు. ఇక ఇప్పటికీ కూడా మహేష్ ఫ్యాన్స్ ఆ సినిమాలోని మహేష్ బాబు స్టైల్ ని గుర్తు చేసుకుంటున్నారంటే, దానికి చాలావరకు కారణం దర్శకుడు పూరి అనే చెప్పాలి. ఆ విషయమై దర్శకుడు పూరికి మహేష్ ఫ్యాన్స్ ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పవలసిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: