టాలీవుడ్ సినిమా పరిశ్రమకు నీతోడు కావాలి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఛార్మి కౌర్, మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది .ఇక ఆ తరువాత శ్రీఆంజనేయం, గౌరీ, మాస్, రాఖి, చక్రం వంటి సినిమాల్లో తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టిన ఛార్మి, ఆ పై కొంత సక్సెస్ లు అందుకోలేకపోయింది. ఇక ఆ తరువాత ఆమె నటించిన మంత్రం సినిమా అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకుని సోలో హీరోయిన్ గా ఛార్మికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఆ సినిమా స్పూర్తితో ఆ తరువాత వచ్చిన మంగళ, మంత్ర2 సినిమాలు మాత్రం సక్సెస్ కాలేదు. 

 

ఇక అక్కడి నుండి మధ్యలో అక్కడక్క ప్రత్యేక గీతాల్లో కూడా నర్తించిన ఛార్మి, ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన జ్యోతి లక్ష్మి సినిమా ద్వారా నిర్మాతగా మారింది. ఇక ఆమె నటిస్తూ నిర్మించిన ఆ సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ, ఆ తరువాత నుండి పూరి దర్శకత్వంలో వస్తున్న సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా ఛార్మి వ్యవహరిస్తూనే ఉంది. ఇక ఇటీవల రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు కూడా కో ప్రొడ్యూసర్ గా వ్యహరించి నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న ఛార్మి, ప్రస్తుతం పూరి, విజయ్ దేవరకొండ ల కాంబోలో తెరకెక్కుతున్న ఫైటర్ కు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తోంది. 

 

ఇకపోతే ఎప్పటికప్పుడు తన సినిమా, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్ తో సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేసుకునే అలవాటున్న ఛార్మి, నేడు వైట్ కలర్ డ్రెస్ వేసుకుని పోస్ట్ చేసిన రెండు ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. ఆ డ్రెస్ ఏంటి నువ్వెంటి, మరీ ఇంత అందంగా దేవకన్యలా అంటే ఉంటె, కుర్రాళ్లకు నీ అందం చూసి తట్టుకోవడం ఎంత కష్టమో తెలుసా అంటూ పలువురు నెటిజన్లు ఆమె ఫోటోలపై అందంగా కామెంట్స్ చేస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: