ప్రస్తుతం టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కలయికలో తెరక్కిస్తున్న భారీ హిస్టారికల్ మూవీ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీంగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య దాదాపుగా నాలుగువందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే. 

 

ఇకపోతే ఈ సినిమా తరువాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారు అనే దానిపై పలు విధాలుగా టాలీవుడ్ వర్గాల్లో కొద్దిరోజుల నుండి విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే కొన్నేళ్ల నుండి కూడా మహేష్ బాబు తో రాజమౌళి ఒక సినిమా చేస్తారని, అలానే ఆ సినిమాని ప్రముఖ నిర్మాత దుర్గ ఆర్ట్స్ అధినేత అయిన కేఎల్ నారాయణ నిర్మిస్తారని వార్తలు వచ్చాయి. అలానే పలు సందర్భాల్లో అటు మహేష్, ఇటు రాజమౌళి కూడా ఆ విషయాన్ని తెలిపారు. అయితే ఆ సినిమా నేడు హఠాత్తుగా క్యాన్సిల్ అయిందని, ప్రస్తుతం ఆయన తీస్తున్న ఆర్ఆర్ఆర్ తరువాత తన తదుపరి సినిమాని ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తారని అంటున్నారు. 

 

అయితే ఏ కారణాల వలన మహేష్ తో కేఎల్ నారాయణ నిర్మాణంలో రాజమౌళి చేయవలసిన సినిమా హఠాత్తుగా నిలుపుదల అయిందనేది తెలియదని, అయితే ఒకవేళ ఆయన భవిష్యత్తులో మహేష్ తో సినిమా చేయవలసి వస్తే అది మరొక బ్యానర్ లో చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, దీనిపై పలువురు మహేష్ ఫ్యాన్స్ స్పందిస్తూ, ఒక్కసారిగా తమ హీరోతో సినిమా చెయలేనని భారీ షాక్ ఇచ్చి చేతులెత్తేసిన రాజమౌళి, రాబోయే రోజుల్లో అయినా చేస్తారో లేదో అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: