టాలీవుడ్ లో చాలా వరకు రిలేషన్ బ్రేకబుల్ గానే ఉంటాయి. ఏ ఇద్దరు కలిసి ఏళ్ళ తరబడి ప్రయాణం చేయరు. అలా చేసిన చాలా తక్కువమంది మాత్రమే రిలేషన్ ని మధ్యలో ఆపకుండా కొనసాగించేవాళ్ళు ఉంటారు. అయితే ఎక్కువగా హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ అన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ సినిమా సక్సస్ అయితే వరుసగా రెండు సినిమాలలో ఆఫర్స్ వస్తాయి. ఆ సినిమాలు గనక సూపర్ హిట్ అయితే స్టార్స్ పక్కన అవకాశాలు అందుకుంటారు. ఆ సినిమాలు గనక బ్లాక్ బస్టర్ అయితే ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయిపోతుంది.

 

రెమ్యూనరేషన్ కూడా బాగా డిమాండ్ చేస్తారు. క్షణం తీరిక లేకుండా బిజి బిజీగా గడుపుతారు. ఇక కమర్షియల్ ఈవెంట్స్ ద్వారా కూడా బాగా సంపాదించుకుంటారు. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ అండ్ కోలీవుడ్ ఇండస్ట్రీలలోను స్టార్ హీరోల సినిమాలలో మంచి చాన్సెస్ ని అందుకుంటారు. అయితే ఇదంతా 5-6 సంవత్సరాల వరకు మాత్రమే. మరీ కాలం కలిసి వస్తే ఇంకో నాలుగేళ్ళు. అంతే ఇక ఈ లోపే కొత్త హీరోయిన్స్ తాకిడి గట్టిగా తగిలి నెమ్మదిగా సినిమా అవకాశాలు తగ్గుముఖం పడతాయి.

 

అయితే ఇలా హీరోయిన్స్ కొన్నాళ్ళు ఇండస్ట్రీలో కొనసాగడానికి ప్రధానంగా సక్ససే కారణం. ఒక హీరోయిన్ వల్ల సక్సస్ వస్తేనే ఆ హీరోయిన్స్ ని మేకర్స్ గాని, ప్రేక్షకులు గాని నెత్తిమీద పెట్టుకుంటారు. లేదంటే పక్కన పెట్టేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఎవరికైనా సక్ససే ఇంపార్టెంట్. అది లేకపోతే జనాలు కాస్త కూడా పట్టించుకోరు. ముఖ్యంగా మేకర్స్ ఒక హీరోయిన్ కి వరుసగా రెండు ఫ్లాపులు పడితే నైస్ గా వదిలించుకుంటారు. ఆఖరికి అడ్వాన్స్ ఇచ్చిన సినిమా నుంచైనా తప్పించేస్తారు. ఇక్కడంతా లేనా దేనా పద్దతే. మేము హిట్ ఇస్తేనే మాకు మళ్ళీ సినిమా ఇస్తారు. ఫ్లాపులొచ్చినా మమ్మలిని భరించి కోట్లు ఏ నిర్మాతా రిస్క్ చేయరని చాలా మంది హీరోయిన్స్ బాహాటంగా చెప్పిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: