మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 152వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ నైట్ షిఫ్టుల్లో  కూడా పనిచేస్తున్నారు. ఇప్పటికే కొంత టాకీ పార్ట్ తో పాటు మూడు ఫైట్లు, ఒక పాట చిత్రీకరణ కూడా జరిగిందని చిరంజీవే స్వయంగా చెప్పారు. అయితే.. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలక పాత్ర ఉందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. చిరంజీవికి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పాత్రను తనయుడు రామ్ చరణ్ చేస్తాడని కూడా వార్తలు వచ్చాయి. దీనిపై ఇంతవరకూ క్లారిటీ లేకపోగా మహేశ్, అల్లు అర్జున్ పేర్లు కూడా బయటకు వచ్చాయి.

 

 

నిజానికి ఈ పాత్రను రామ్ చరణే చేయాల్సి ఉన్నా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన మేకోవర్ లోనే ఉన్నాడు. ఈ మేకోవర్ లో ఉండి మరో పాత్రకు వెంటనే లుక్ మార్చడమంటే కష్టమైన పనే. పైగా ఇంకా షూటింగ్ కూడా జరుగుతూనే ఉంది. ఇక మహేశ్ బాబు విషయానికి వస్తే ఆయన సినిమాలపై ఆయనకే ఇంకా క్లారిటీ లేదు. కేవలం దర్శకులను మాత్రమే నమ్ముతూ వెళ్తున్న మహేశ్ కు చిరంజీవి సినిమాలో ఓ పాత్ర అంటే చేయలేకపోవచ్చు. ఇందుకు మహేశ్ ను సంప్రదించినట్టు వార్తలు వచ్చినా ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు.

 

 

వీరితో పాటు అల్లు అర్జున్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. చరణ్, మహేశ్ కాకపోతే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఈపాత్రకు న్యాయం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బన్నీ పెర్మార్మెన్స్ కు తిరుగుండదు. పైగా కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ టైమ్ లో బన్నీనే  కరెక్ట్ అనే వాదనలు కూడా వస్తున్నాయి. పైగా చిరంజీవితో పాటు నటించటమంటే బన్నీ కాదనే పరిస్థితి లేదు. మరి యూనిట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: