రామ్.. ఎనర్జిటిక్ హీరో.. ఇప్పుడే ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కొట్టి.. ఆ ఊపు మీద మరో అద్భుతమైన చిత్రాన్ని తీస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. అలాంటి ఈ హీరోకు విభిన్నమైన కథనాలతో ప్రేక్షకులను అలరించి టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఎంచుకున్న శర్వానంద్ కు సంబంధం ఏంటో మీకు తెలుసా? 

 

వారి బంధం గురించి ప్రేక్షకులు తెలీదు.. ఇద్దరు బంధువులు అయినా సరే ఎవరి పేరు ఎవరు వాడుకోకుండా సొంతంగా ఎదుగుతూ వస్తున్నారు. అలాంటి వీరి బంధం ఏంటో తెలుసా? ఏదో కాదు అండి.. బావ బామ్మర్దుల బంధమే.. అది ఎలా ? శర్వానంద్ కు ఇంకా పెళ్లి కాలేదు కదా ? ఆలా ఎలా బావ అవుతాడు అని మీరు అనుకోవచ్చు.. 

 

కానీ బావ అవ్వాలి అంటే అతనే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా? తనకు ఒక అన్న ఉన్న ఆ అన్నకు రామ్ అక్కతో పెళ్లి అయినా కూడా శర్వానంద్ బావనే అవుతాడు కదా! అలానే శర్వానంద్ బావ అయ్యాడు.. అవును మీరు చదివింది నిజమే.. రామ్ అక్క అయినా మధు స్మిత పోతినేనిని రామ్ అన్న పెళ్లి చేసుకున్నాడు. 

 

ఆలా వారిద్దరి మధ్య బంధం ఏర్పడింది. ఇకపోతే శర్వానంద్ రామ్ వారి కెరియర్ పై పూర్తి ద్రుష్టి పెట్టారు. రామ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకొని ప్రస్తుతం మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్ని మాస్ చిత్రాల్లో నటిస్తూ మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. 

 

అయితే శర్వానంద్ కూడా తన నటనతో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడు మూడు సినిమాలు ప్లాప్ వచ్చాయి కానీ తనకు సినీ అవకాశాలు మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. అయితే స్టార్ హీరోయిన్లు శర్వానంద్ కు కలిసి రావడం లేదు అని ఓ వార్త కూడా సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: