సీనియర్ హీరో సుమంత్ అక్కినేని నాగార్జునకు ఎం అవుతాడో తెలుసా? వీరిద్దరి మధ్య బంధం ఏంటో తెలుసా? వీరిద్దరి మధ్య బంధం.. నాగ చైతన్యకు వెంకటేష్ కు ఉన్న బంధం లాంటిదే.. అదేనండి.. నాగార్జున మేనల్లుడు సుమంత్.. అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కుమార్తె సత్యవతి.. యార్లగడ్డ సురేంద్ర కొడుకే సుమంత్.. 

 

చిన్నప్పటి నుండి కూడా తాత నాగేశ్వర రావు వద్దే పెరిగాడు సుమంత్. ఇక నాగార్జున.. సుమంత్ ఇద్దరు కూడా అన్నదమ్ముల్లల కలిసి పెరిగారు. అందుకే మొదటి నుండి సుమంత్ అంటే నాగార్జునకు ఇష్టం. సుమంత్ మొదటి సినిమా నుండి నాగార్జున తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చి ముందుకు తెచ్చాడు.. 

 

అయితే సుమంత్ కెరియర్ అద్భుతంగా ఉంటుంది అనుకున్న సమయంలో మలుపు తిరగడం.. ఆ తర్వాత సుమంత్ కు నాగార్జునకు గొడవలు జరిగాయి అని వార్తలు రావడం.. ఆ వార్తలపై సుమంత్ స్పందించి.. మా మధ్య ఏలాంటి దూరం ఏర్పడలేదు.. ఎప్పటికి రాదు కూడా అని చెప్పడం అంత తెలిసిన విషయమే. 

 

అయితే సుమంత్ కు నాగార్జునకు మంచి బంధం ఉంది. రెండు సంవత్సరాల ముందు అంటే 2017లో కూడా సుమంత్ ఓ అద్భుతమైన ప్రేమ కథను తీసి హిట్ కొట్టాడు. ఆ సినిమానే మళ్లీ రావా. అయితే అలా హిట్ కొట్టిన సుమన్ ఖచ్చితంగా ఇంకా మంచి హిట్ కొడుతాడు అని.. మళ్లీ ఫామ్ లోకి వస్తాడు అని అభిమానులు అంత ఆశించారు. అయితే సుమన్ మళ్లీ ఇదం జగత్ అనే సినిమాతో సినిమాకు దూరం అయ్యాడు. 

 

మళ్లీ సుమంత్ ఎప్పుడు ఫామ్ లోకి వస్తాడో చూడాలి.. కాగా సుమంత్ ఓ మంచి నటుడు అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే సుమంత్ జీవితంలో సినిమాలను ఎలా అయితే రాంగ్ గా ఎంపిక చేసుకున్నాడో అప్పట్లో పెళ్లి విషయంలో కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు.. అందుకే ప్రస్తుతం రెండో పెళ్లి గురించి ఆలోచించకుండా ఒంటరిగానే జీవిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: