నాగ చైతన్య.. వెంకటేష్.. వీళ్ళ ప్రేమను మనం ఈ మధ్యే చూశాం.. ఎక్కడ చూశాం అబ్బా అనుకుంటున్నారా? ఇంకా ఎక్కడ అండి.. వెంకీ మామ సినిమాలో చూశాం.. నిజంగా వాళ్ళ ప్రేమలు అంత అద్భుతంగా ఉంటాయా? అనే అనుమానం కలిగేలా సినిమా చేశారు. అయితే నిజానికి వెంకటేష్ కు నాగ చైతన్య అంటే చాలా ఇష్టం. 

 

ఎందుకంటే వాళ్ళు నిజంగా మామ అల్లుళ్ళు కాబట్టి.. విక్టరీ వెంకటేష్ నాగ చైతన్యకు సొంత మేనమామ.. ఎలా అంటే ? అక్కినేని నాగార్జున మొదటి భార్య లక్ష్మి దగ్గుబాటి వెంకటేష్ సొంత చెల్లి. అప్పట్లో కొన్ని కారణాల వల్ల వాళ్ళు విడిపోయారు. ఇద్దరు విడాకులు తీసుకొని వేరు వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. 

 

అలా విడిపోయిన వెంకటేష్ కు కోపం లేదు.. అల్లుడు అంటే వెంకటేష్ కు ప్రాణం. సినిమాలో చూపించినట్టే చిన్నప్పటి నుండి నాగచైతన్య వెంకటేష్ దగ్గరే పెరిగాడు. నాగ చైతన్యకు 18 ఏళ్ళు వచ్చే వరుకు వెంకటేష్ వద్దే పెరిగాడు. అందుకే వెంకీకి నాగ చైతన్య అంటే అంత ఇష్టం.. 

 

ఆ ఇష్టాన్నే నాగ చైతన్య.. వెంకటేష్ వెంకీమామ సినిమాలో చూపించారు. కానీ ఆ సినిమాలో అవసరం లేని కొన్ని సీన్స్ వల్ల సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ కాలేదు.. కొంచం నెగటివ్ టాక్ కూడా వచ్చింది. ఏది ఏమైనా సినిమాలో వెంకీ చైతు సీన్స్ అద్భుతంగా ఉన్నాయి.. మామ అల్లుళ్ళ ప్రేమలు ఇంత అద్భుతంగా ఉంటాయా అనేంత రేంజ్ సినిమా ఉంది. 

 

కాగా నాగ చైతన్య అంటే వెంకటేష్ కి ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ అక్కినేని అఖిల్ నే అల్లుడుగా చేసుకోవాలని ఆలోచిస్తున్నట్టు సోషల్ మీడియాలో భారీ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందొ అఖిల్ కి పెళ్లి అయితే తప్ప తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: