టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటించే 30వ చిత్రం ఇది. 2021 వేసవికి ఈ సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు అఫిషియల్ కన్పర్మేషన్ కూడా వచ్చేసింది. అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ల సంగతి, టెక్నీషియన్ల సంగతి ఇంకా తేలలేదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇప్పటికి పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ లిస్టులో ఇప్పుడు సమంత కూడా చేరింది.

 

 

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లలో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు పూజా హేగ్డే, రష్మిక మందన. ఇద్దరికీ ట్రాక్ రికార్డు సమంగానే ఉంది. హిట్లు మీద హిట్లు ఇస్తున్న వీరిద్దరిలో ఒకరిని ఎన్టీఆర్ కు జోడీగా తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ మాత్రం అరవింద సమేత.. కాంబినేషనే రిపీట్ చేయాలని చూస్తున్నాడని అంటున్నారు. వరుస హిట్లతో టాలీవుడ్ గోల్డెన్ లెగ్ రష్మిక మందన తీసుకోవాలని కూడా భావిస్తున్నారట. అయితే టాలీవుడ్ లక్కీ లేడీ సమంత పేరు కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్టు  లేటెస్ట్ గా సమాచారం అందుతోంది. సమంత ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. పైగా ఎన్టీఆర్ తో ఇప్పటికే మూడు సినిమాలు కూడా చేసింది.

 

 

రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ త్వరలోనే పూర్తికానుంది. ఎన్టీఆర్ కొత్త లుక్ లోకి రాగానే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారని అంటున్నారు. ఈలోపు హీరోయిన్లను ఫైనలైజ్ చేసుకోవాలని త్రివిక్రమ్ ప్లాన్. ప్రస్తుతం బన్నీతోనూ, తమిళ్ లోనూ నటిస్తోంది రష్మిక. అఖిల్, ప్రభాస్ సినిమాల్లో పూజ నటిస్తోంది. సమంత తమిళ్ లో ఓ సినిమా చేస్తోంది. మరి వీరిలో త్రివిక్రమ్ ఎవరిని ఎన్టీఆర్ కు హీరోయిన్ గా తీసుకుంటాడో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: