సినీ రంగానికి సంబంధించి వచ్చే వార్తల్లో సగానికి పైగా గాసిప్పే ఉంటాయి. ముఖ్యంగా స్టార్  హీరోల సినిమాల విషయంలో ఏ వార్త నమ్మాలో.. ఏ వార్త నమ్మకూడదో ఒకటి రెండు సార్లు ఆలోచిస్తే గాని చెప్పలేం. స్టార్ హీరోల సినిమాకు సంబంధించిన కాంబినేషన్స్‌ నుంచి కాస్టింగ్‌, టెక్నిషియన్స్‌, రిలీజ్‌ డేట్స్‌, చివరకు టైటిల్స్‌ విషయంలో కూడా రకరకాల గాసిప్స్‌ వస్తుంటాయి. అలాంటి ఓ క్రేజీ గాసిప్‌ ఈ వారం ఫిలిం సర్కిల్స్‌ లో తెగ హల్‌ చల్‌ చేసింది.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్ ఆర్‌ ఆర్‌ షూటింగ్‌ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు తారక్‌. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తయ్యింది. ముందుగా ఆర్ ఆర్ ఆర్‌ ను ఈ ఏడాది జూలై లోనే రిలీజ్ చేయాలని భావించినా నిర్మాణ కార్యక్రమాలు ఆలస్యం అవుతుండటంతో వాయిదా వేశారు. భారీగా రూపొందుతున్న ఈ పీరియాడిక్‌ మల్టీ స్టారర్‌ మూవీ వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్‌ కానుంది.

అయితే తాజాగా తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించాడు తారక్‌. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్‌. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్‌ , ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్‌ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా టైటిల్‌ కు సంబంధించి మరో క్రేజీ న్యూస్‌ టాలీవుడ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ సెంటిమెంట్‌ ను కంటిన్యూ చేస్తూ అయిననూ పోయి రావలే హస్తినకు అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NANDAMURI TARAKA RAMA RAO' target='_blank' title='ntr-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ntr</a> 30 title

మరింత సమాచారం తెలుసుకోండి: