ఎంతపెద్ద స్టార్ అయినా కంఫర్ట్ జోన్ లో ఉండేందుకు ఇష్టపడతాడు. సక్సెస్ తెచ్చి జానర్ లోనే జర్నీ చేయాలనుకుంటాడు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం కంఫర్ట్ జోన్ ని విడిచిపెట్టాడు. కొత్త కథలతో డిఫరెంట్ జానర్స్ లోకి వెళ్తున్నాడు. 

 

విజయ్ దేవరకొండ లవ్ స్టోరీని పక్కనపెట్టేస్తున్నాడు. ప్రేమ కథలను సైడ్ చేసి, వైవిధ్యమైన కథల్లోకి వెళ్లిపోతున్నాడు. మాస్ యాక్షన్, ఫ్యామిలీ స్టోరీస్ అంటూ డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ టైమ్ లో చెప్పినట్టుగానే లవ్ స్టోరీస్ నుంచి దూరమవుతున్నాడు విజయ్. 

 

విజయ్ దేవరకొండ ఇంటెన్స్ లవ్ స్టోరీ అర్జున్ రెడ్డితో బాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. గీత గోవిందం కూడా లవ్ స్టోరీగానే కుర్రాళ్లకు కనెక్ట్ అయ్యింది. దీంతో విజయ్ కు ఈ జానర్ చాలా కంఫర్ట్ గా మారింది. కానీ వైవిధ్యమైన కథలు అంటూ విజయ్, ఈ జానర్ నుంచి బయటపడుతున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత ప్రేమ కథలకు బ్రేక్ ఇచ్చాడు. 

 

విజయ్ దేవరకొండ ఇప్పుడు యాక్షన్ జానర్ లో పైటర్ చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మల్టీ లింగ్వల్ గా వస్తోంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ టచ్ చేసే శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. వీటితో పాటు కామెడీ ఎంటర్ టైనర్స్ తో ఆకట్టుకునే మారుతి దర్శకత్వంలోనూ సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. సో ఈ లిస్ట్ చూస్తే విజయ్ నిజంగానే ప్రేమ కథలకు బ్రేక్ చెప్పినట్టు కనిపిస్తోంది. 

 

విజయ్ దేవరకొండకు ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం కాదు. తక్కువ కాలంలోనే ఎక్కువ మంది ప్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఆయన సినిమాలంటే కుర్రకారు పడిచస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ యూత్ నే కాకుండా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ తో సైతం వచ్చేందుకు సిద్ధమైపోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: