సక్సెస్ లో ఉన్నప్పుడు తర్వాత ఏంటి అనే మాట వింటే చాలా ఉత్సాహం వస్తుంది. అదే కెరీర్ కొంచెం తేడాగా ఉన్నప్పుడు సేమ్ క్వశ్చన్ ఎదురైతే సందేహాలు స్టార్ట్ అవుతాయి. కెరీర్ ఉంటుందా.. ఊడిపోతుందా.. అనే భయాలు మొదలవుతాయి. ఇప్పుడు అనుష్క కూడా ఇలాంటి డేంజరస్ సిట్యువేషన్ లోనే ఉంది. 

 

స్టార్ హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి లాంటి సినిమాల్లో పవర్ ఫుల్ రోల్స్ ప్లే చేసి, మార్కెట్ లోనూ వాటా దక్కించుకుంది. అలాంటి హీరోయిన్ కు ఇప్పుడు తర్వాత ఏంటి అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ హీరోయిన్ చేతిలో నిశ్శబ్దం అనే సినిమా తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. 

 

హీరోయిక్ రోల్స్ లో ఆకట్టుకుంటోన్న అనుష్క జర్నీని సైజ్ జీరో మార్చేసింది. ఈ సినిమా కోసం వెయిట్ పెరిగి మరీ ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేయాలనుకున్న స్వీటీకి, ఈ బరువే పెద్ద ఫ్లాబ్లమ్ క్రియేట్ చేసింది. కొంచెం బొద్దుగా ఉన్న అనుష్కని తీసుకోవడానికి దర్శక నిర్మాతలు, హీరోలు ఇంట్రెస్ట్ చూపించడంలేదు. దీంతో ఈ బ్యూటీ కెరీర్ స్లో అయిపోయింది. 

 

అనుష్క వయసు ఇప్పుడు 38ఏళ్లు. తెలుగునాట కమర్షియల్ హీరోయిన్ ఏజ్ దాటేసి స్వీటీ చాలా ఏళ్లు అయింది. దీంతో సీనియర్లకు మాత్రమే హీరోయిన్ ఆప్షన్ గా మిగిలిపోయింది అనుష్క. అయితే ఉన్న నలుగురు సీనియర్లు కూడా వేరే ఆప్షన్స్ వైపు వెళ్తున్నారు గానీ.. జేజెమ్మ వైపు చూడటం లేదు. దీంతో అనుష్క కెరీర్ క్లైమాక్స్ కు చేరిందనే కామెంట్స్ వస్తున్నాయి. 

 

అనుష్క చాలా పాపులర్ హీరోయిన్. ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో సైతం మెప్పిస్తోంది. అలాంటి జేజమ్మకు పెద్ద కష్టమే వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే సైజ్ జీరో మూవీతో బరువెక్కడం ఓ ఎత్తైతే.. అందులోనుంచి అంత తొందరగా బయటపడలేకపోవడం.. మరోవైపు వయసు మీదపడటం.. తనకు వచ్చే ఛాన్స్ లన్నీ కుర్ర హీరోయిన్లు లాక్కుపోవడం వల్ల అనుష్క కెరీర్ ఢీలా పడిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: