ప్రతివారం తెలుగు ప్రేక్షకులకు సరి కొత్త సినిమాలు అలరిస్తూనే వుంటాయి అనే విషయం తెలిసిందే. అయితే ఎన్ని సినిమాలు విడుదలైన కొన్ని సినిమాలు కొన్ని సీన్లు మాత్రం మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. మరి ఈ వారం మొత్తంలో బాగా ప్రేక్షకులకు నచ్చిన మళ్లీ మళ్లీ చూడాలి అనిపించినా సీన్లు ఏంటో తెలుసుకుందాం రండి. ఈ వారం మొత్తం హాట్ టాపిక్ గా నిలిచిన సినిమా భీష్మ. నితిన్ హీరోగా నటించిన సినిమాలో  రష్మిక మందన జోడిగా నటించింది. ఇక మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ప్రేక్షకుల్లో . ఈ సినిమా విడుదలైన తర్వాత కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఇప్పటికే ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్న విషయం తెలిసింది ఇక తాజాగా నితిన్  నటించిన  భీష్మ సినిమా కూడా ఈ కోవకు చెందిందే. 

 

 

దీంతో నితిన్ భీష్మ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు అనే చెప్పాలి. అయితే భీష్మ సినిమా ఈ వారం ప్రేక్షకులను ఎక్కువగా అలరించింది. మరి భీష్మ సినిమాలో  మళ్లీ మళ్లీ చూడాలనిపించే సీన్  ఏది అంటే. భీష్మ సినిమా లోని ప్రతి కామెడీ సీన్. ఈ సినిమాలో  నితిన్ తన కామెడీ టైమింగ్ తో అదరకొట్టాడు అనే చెప్పాలి. అద్భుతమైన కామెడీ టైమింగ్ పట్టేసి సినిమా చూస్తున్న ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. ప్రేక్షకులందరూ వన్స్ మోర్ అంటూ భీష్మ సినిమాను  చూసేస్తున్నారు. ఎన్నిసార్లు చూసినా పగలబడి నవ్వుకుంటున్నారు. 

 

 

 ఈ సినిమాలోని ప్రతి సీన్లో కామెడీని దట్టించిన దర్శకుడు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ముఖ్యంగా ప్రతి సీన్లో నితిన్ పండించే కామెడీ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలో  వెన్నెల కిషోర్ నితిన్ మధ్య సాగే కామెడీ సీన్లు ప్రేక్షకులకు మరింతగా నచ్చుతాయి. మొత్తంగా అయితే ఈ వారం మళ్లీ మళ్లీ చూడాలి అని ప్రేక్షకులకు అనిపించినా సీన్ మాత్రం భీష్మ కామెడీ అని చెప్పాలి. కేవలం కామెడీనే కాదు ఈ సినిమాలో రస్మిక తో నితిన్ రొమాన్స్ కూడా అందరినీ ఆకర్షించింది. మొత్తంగా ఒక సీన్ మాత్రమే కాదు భీష్మ సినిమా మొత్తం వన్స్మోర్ అనేలా  ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: