మహేష్ నమ్రత లకు పెళ్ళి జరిగి 15 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఈ మధ్యనే అమెరికా నుండి తిరిగి వచ్చిన మహేష్ నమ్రతలు కలిసి ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత అనేక ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. మహేష్ వెనుక స్ట్రాంగ్ ఫోర్స్ తాను కాదు అనీ రియల్ స్ట్రాంగ్ ఫోర్స్ సూపర్ స్టార్ కృష్ణ అంటూ ఆమె కామెంట్స్ చేసింది. 


మహేష్ కు ఇప్పటికీ తన కెరియర్ పరంగా ఏ సలహాలు కావలసి వచ్చినా తన తండ్రి కృష్ణ ను అడుగుతూనే ఉంటాడనీ ఒక కథ విషయంలో తాను నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా ఆ కథను మహేష్ తన తండ్రికి వినిపిస్తాడు అన్న క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు తమ కుటుంబానికి స్ఫూర్తి కృష్ణ అంటూ సూపర్ స్టార్ కృష్ణ లేకుంటే మహేష్ ఇమేజ్ లేదు అంటూ కామెంట్స్ చేసింది. 


ఇదే సందర్భంలో తన పిల్లలు గౌతమ్ సితారల గురించి మాట్లాడుతూ వారిద్దరి మార్కులు గురించి తాను పెద్దగా పట్టించుకోనని అయితే వారిద్దరు ఖచ్చితంగా సినిమా స్టార్స్ అవుతారు అన్న విషయం పై తనకు క్లారిటీ లేదనీ అందువల్ల భవిష్యత్ లో తన పిల్లలు ఇద్దరూ ఏమవుతారో తనకు తెలియదు అంటూ కామెంట్ చేసింది. మహేష్ కు పెళ్ళి అయి 15 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ హీరోయిన్స్ తో రోమాన్స్ చేసే విషయంలో అతడు పడే సిగ్గును తాను తొలిగించలేకపోయాను అంటూ నమ్రత జోక్ చేసింది..


వాస్తవానికి తన మామయ్య కృష్ణ తనకు ఒక తండ్రి లా అనిపిస్తారని తమ పిల్లలతో కృష్ణ చేసే అల్లరి చూస్తే ఒక చిన్నపిల్లవాడిలా కనిపిస్తాడు అంటూ నమ్రత కామెంట్ చేసింది. ఇదే సందర్భంలో మహేష్ తల్లి ఇందిర గురించి మాట్లాడుతూ తనమీద తన అత్తగారు వేసే జోక్స్ సెటైర్లు ఒకవైపు నవ్వుని తెప్పిస్తూనే మరొక వైపు ఆమె చిన్నపిల్ల మనస్తత్వాన్ని తెలియచేస్తాయి అంటూ మహేష్ కు తనకంటే తన తల్లి అంటేనే ఎక్కువ ఇష్టం అంటూ జోక్ చేసింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: