టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. తేజ దర్శకత్వంలో లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైంది. మొదటిసినిమాతోనే తెలుగమ్మాయిలా మంచి పేరు సంపాదించుకుంది. నటిగా మంచి స్థాయికి వస్తుందని ఆ సినిమాతోనే అందరికీ నమ్మకాన్ని కలిగేలా చేసింది. ఆ తర్వాత చందమామ సినిమా కాజల్ సినిమా కెరీర్ బాగా ఊపందుకుంది. వరుసగా సినిమాలు చేస్తూ అంచలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించుకుంది. టాలీవుడ్ లో కాజల్ దాదాపు అందరి సరసన నటించింది. కోలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

 

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీ హీరోలతో నటించిన హీరోయిన్ గా కాజల్ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక గత కొంతకాలా జాకల్ కి సినిమాలు కలిసి రావడం లేదు. వరుసగా ఫ్లాప్స్ పడుతున్నాయి. దానికి తోడు ప్రస్తుతం పూజా హెగ్డే, రష్మిక మందన్న ల హవా నడుస్తుండటం తో కాజల్ కి బ్రేజ్ పడింది. తన ఆఖరి హిట్ సినిమా అంటే తేజ దర్శకత్వంలో రానా దగ్గుబాటి నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమానే. ఆ సినిమా కాజల్ కి హిట్ సినిమా. దాని తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కాజల్ కి హిట్ పడలేదు. సినిమా అవకాశాలు లేవు.

 

అయితే ప్రస్తుతం కాజల్ ని కొన్ని పబ్లిక్ ఈవెంట్స్ కి రమ్మని ఆహ్వానిస్తున్నారట. వాస్తవంగా హీరోయిన్స్ ఒక పబ్లిక్ ఫంక్షన్ అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి వెళ్ళి రిబ్బన్ కట్ చేయాలంటే లక్షల్లో రెమ్యూనరేష్ ముట్ట చెబుతారు. ఖరీదైన బహుమతులు ఇస్తారు. కేవలం గంట సేపు సందడి చేసినందుకు భారీ మొత్తం లో రెమ్యూనరేషన్స్ ఆఫర్ చేస్తారు. కాని కాజల్ ససేమిరా అంటూ అంటుందటం. గంట సమయం కేటాయిస్తే భారి మొత్తం ఇస్తామంటే కూడా కాజల్ ఇలా ఎందుకంటుందని అనుకుంటున్న అందరికి తన సన్నిహితుల ద్వారా మేనర్ ద్వారా తెలిసిన విషయం తనకి జరిగిన ఘోరమైన సంఘటనలు. 

 

ఒక సంఘటన సినిమా వ్యక్తి నుండే ఎదురైతే మరో సంఘటన ఆకతాయిల వల్ల జరిగింది. గతంలో ఒకసారి చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళిన కాజ్ల్ కి చెప్పుకోలేని అవమానం జరిగింది. జనంలో సందడిగా ఉన్న ఆకతాయి కాజల్ ప్రైవేట్ ప్లేసెస్ ని గట్టితాగా పట్టుకున్నాడు. క్షణాల్లో తడిమేశాడు. ఆ సఘటంతో కాజల్ ఎంతో ఆవేదన కి అవమానానికి అసహనానికి  గురైందట. యాజమాన్యాన్ని చివాట్లు పెట్టింది. ఈ రెండు సంఘటనలతో కాజల్ పబ్లిక్ ఫంక్షన్స్ అంటే చచ్చినా ఒప్పుకోవడం లేదట. లక్షల్లో రెమ్యూనరేషన్ కంటే ఇలాంటి ఘోరమైన సంఘటనలే కాజల్ ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయట. అందుకే నిర్మొహమాటంగా నో చెప్పేస్తుందట. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: