బ్లాక్ బస్టర్ దాహంలో ఉన్న రవితేజ, సూపర్ హిట్ ఫార్ములాను రిలీజ్ చేస్తున్నాడు. రాజమౌళి క్రియేట్ చేసిన డ్యుయల్ రోల్ ను ఒకే క్యారెక్టర్ గా మార్చి బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు మాస్ మహారాజ్. సింగిల్ క్యారెక్టర్ లో రెండు వేరియేషన్స్ చూపిస్తూ, ట్రేడ్ మార్కెట్ కు క్లాక్ ఎక్కించాలనుకుంటున్నాడు రవితేజ. 

 

రవితేజ కెరీర్ లో వన్ఆఫ్ ది సూపర్ హిట్ విక్రమార్కుడు. అత్తిలి సత్తిబాబు, విక్రమ్ సింగ్ రాథోడ్ గా రవితేజ డ్యుయల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మాస్ మహారాజ్ పోషించిన ఈ రెండు పాత్రలు ఇతని కెరీర్ లోనే మెమరబుల్ గా నిలిచాయి. అలాంటి ఈ స్పెషల్ క్యారెక్టర్స్ రెండూ క్రాక్ లో కనిపిస్తున్నాయి అంటున్నారు నెటిజన్లు.  

 

రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో పోలీస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు రవితేజ. శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ టీజర్ చూస్తే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ లో ఓ అత్తిలి సత్తిబాబు కనిపిస్తున్నాడు అంటున్నారు జనాలు. 

 

రవితేజ హిట్ కొట్టి చాలా కాలమైంది. రాజా ది గ్రేట్ తర్వాత ఈ హీరోకు వరుసగా నాలుగు ఫ్లాపులొచ్చాయి. దీంతో ఈ హీరో మార్కెట్ చాలా పడిపోయింది. మరి ఈ ఫ్లాపుల పీరియడ్ లో రవితేజ చేస్తోన్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటుంది. క్రాక్ తో ఈ హీరో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా అనేది ఆసక్తికరంగా మారింది. 

 

రవితేజకు మాస్ మహారాజగా సినీ జనాల్లో మంచి పేరుంది. ఆయన నోట నుండి వచ్చే డైలాగ్ డెలివరీ కోసం ప్రేక్షకులను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. డైలాగ్ తో నవ్వులు పూయించడమే కాదు.. దిమ్మ తిరిగే కామెంట్లతో ప్రేక్షకులను థియేటర్ల చుట్టూ తిప్పేసుకుంటాడు. ఇపుడు అర్జంట్ గా రవితేజకు హిట్ కావాలి. అందుకోసం తెగ ట్రై చేస్తున్నాడు ఈ మాస్ మహారాజ.  

మరింత సమాచారం తెలుసుకోండి: