ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌. చిత్రం తెర‌కెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం త‌ర్వాత ఆయ‌న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ‘అరవింద సమేత’ తర్వాత ఓ సినిమా తెరకెక్కనుందని చాలా రోజుల నుంచి వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి సంబంధించి ఓ అప్‌డేట్ న్యూస్ ఈ వారం మ‌న‌కు తెలిసింది. అదేమిటంటే.. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నార‌ట. ఈ చిత్రంలో ఆయ‌న‌కు కథానాయికలుగా పూజా హెగ్డే, నివేధా పేతురాజ్, కియారా అద్వాని ఈ ముగ్గుర పేర్లు వినిపిస్తున్నాయి. మ‌రి ఎవ‌రిని ఫైన‌ల్ చేస్తార‌న్న‌ది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా కోసం ‘‘అయినను పోయి రావలెను హస్తినకు’’ అనే టైటిల్ ఫిలిం చాంబ‌ర్‌లో రిజిష్టర్ చేయించారని స‌మాచారం. 

 

ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ని ఫిక్స్ చేశార‌ట‌. తారక్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగుతో బిజీగా ఉన్నాడు.వివి దానయ్య నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తున్నారు. ఈ సినిమాలో తారక్ కొమరం భీంగా కనిపించనుండగా, రామ్ చరణ్ మాత్రం అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ నెల 20 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రం స్టోరీ లైన్ గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ టచ్ తో ఈ చిత్రం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ ఒక రాజకీయ నాయకుడి కొడుకు పాత్రలో కనిపించబోతున్నాడట. భరత్ అనే నేను.. లీడర్ తరహాలో అనూహ్యంగా హీరో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడట.  మ‌రి గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అర‌వింద్ స‌మేత‌` చిత్రం మంచి హిట్ కొట్టింద‌నే చెప్పాలి. మ‌రి ఈ చిత్రం కూడా అదే త‌ర‌హాలో హిట్ అందుకోవాల‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: