బుల్లితెర‌పై ఎన్నో షోలు అటు సీరియ‌ల్స్‌.. ఇటు సినిమాల‌తో పోటీ ప‌డుతూ టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతున్నాయి. బుల్లితెరపై ప్రముఖ ఛానల్స్ లో ప్రసారం అయిన రియాల్టీషోస్ లలో ముఖ్యంగా ఈ టీవీలో ప్రసారం అవుతున్న షోల‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. జబర్దస్, ఎక్స్ ట్రా జబర్దస్, క్యాష్, ఢీ ఇలా ఎన్నో షోలు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. బుల్లితెరపై మంచి ఫాలోయింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్‌ ప్రదీప్. షోలో ప్రదీప్ ఉన్నాడంటే చాలు… ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేరు.  

 

ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక్క పెళ్లిచూపులు మాత్ర‌మే ఆయ‌న ఇమేజ్ తీసేసింది.. కానీ మిగిలిన‌వ‌న్నీ ఆయ‌న‌కు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. ఢీ షో అయితే ప్రదీప్‌కు బోలెడంత పేరును సంపాదించి పెట్టింది. ఆ షో లో సుడిగాలి సుధీర్‌తో చేసే కామెడీ, పంచ్‌లు బాగా పండాయి. దీంతో ప్రదీప్ అంటే అమ్మాయిల్లోనూ క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో అతడికి ఫాలోయింగ్ బీభత్సంగా ఉంది. ఇక తెలుగులో ‘ఢీ’ బెస్ట్ డాన్స్ షోగా గుర్తింపు పొందింది. అయితే ఈ డాన్స్ షో లో కేవలం డాన్సే కాకుండా.. సుధీర్, రష్మీ గౌతమ్ రొమాంటిక్ కామెడీ.. ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ ఈ షోకు స్పెషల్ అస్సెట్‌గా నిలిచాయి.

 

ఇక తాజాగా వ‌చ్చిన ఎపిసోడ్‌లో కూడా ప్ర‌దీప్ ద‌ ఎట్రాక్ష‌న్‌గా నిలిచాడు. ముఖ్యంగా ఆది, సుధీర్‌, రెష్మీల పై ప్ర‌దీప్ వేసిన పంచ్‌లు హైలెట్‌గా నిలిచాయి. అంతేకాదు, యూట్యూబ్‌లో కూడా ఆ షో టాప్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. యాంకర్‌గా మెప్పించిన ప్రదీప్, ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా…? అనే సినిమాతో వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రదీప్ సినిమా సాంగ్స్‌ మంచి హిట్ కొట్టాయి. యూట్యూబ్‌లో ఈయ‌న పాట‌లు ఫుల్ ట్రెండింగ్‌లో న‌డుస్తున్నాయి. ఇక బుల్లి తెర లో ఎక్కడ చూసినా ఈయ‌న‌ ప్రస్థావనే కొన‌సాగుతోంది. అలాగే ఈ వారం బుల్లితెర సూప‌ర్ యాంక‌ర్‌గా కూడా ఈయ‌నే నిలిచాడు.

 
  

మరింత సమాచారం తెలుసుకోండి: