జ‌బ‌ర్ద‌స్త్‌.. బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ఇక ఇట‌టీవ‌ల బుల్లితెరపై నాగబాబు ఇష్యూ హాట్ టాపిక్ అవుతోంది. ఏడేళ్లపాటు జబర్దస్త్ షోకి జడ్జ్‌గా ఉన్న నాగబాబు ఈటీవీ నుండి బయటకు వచ్చేసి.. జీ తెలుగు ఛానల్‌కి జంప్ చేయడంతో రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఆయ‌న వెళ్లిపోయిన‌ప్ప‌టికీ జ‌బ‌ర్ద‌స్త్ హ‌వానే కొన‌సాగుతోంది. ఈ షోలో నటించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు కామెడీ షోనే కదా అని చీప్‌గా తీసి పారేసిన వాళ్లు కూడా వామ్మో జబర్దస్త్ అంటున్నారు. అలా ఎదిగింది ఈ షో. రేటింగ్స్ పరంగా జబర్దస్త్ సృష్టించిన రికార్డులకు తిరుగులేదు. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ షోకు సాధ్యం కాని రికార్డులకు తెరతీసింది ఈ షో. 

 

అయితే ఒక్కో సారి జ‌బ‌ర్ద‌స్త్ షోలో కొన్ని స్కిట్‌లు కాంట్ర‌వ‌ర్సీల‌కు కూడా దారి తీస్తాయి. అలాంటి సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా హైప‌ర్ ఆది స్కిట్ల గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వాస్త‌వానికి జబర్దస్త్ కామెడీ షోలో చాలా మంది ఉంటారు కానీ హైపర్ ఆది, అనసూయ మధ్య ఉండే కెమిస్ట్రీ మాత్రం చాలా స్పెషల్. నిజానికి వాళ్లిద్దరి మధ్య ఆకాశం, నేలకు ఉన్నంత తేడా ఉంటుంది. కానీ తన ప్రతీ స్కిట్ కోసం అనసూయను వాడేస్తుంటాడు ఆది. ముఖ్యంగా అను రెమ్యునరేషన్ గురించి కూడా చెప్పేసాడు హైపర్ ఆది. దాంతో అన‌సూయ చాలా సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ వారం ప్రసారం అయిన స్కిట్ అంతా అనసూయపైనే చేసాడు ఆది. 

 

అందులో అనసూయ చిన్నప్పటి కారెక్టర్ కూడా ఉంటుంది. అప్పట్నుంచే పక్కన టచ్ అప్ అంటూ మేకప్ మెన్ ఉంటాడు. అక్కడ్నుంచి మొదలైన పంచుల ప్రవాహం పెద్దైన తర్వాత కూడా కొనసాగుతుంది. అనసూయ గారూ మీరు భలే మేనేజ్ చేస్తారండీ అంటే ఆ అందుకేగా అక్కడా ఇక్కడా రెండు చోట్లా బ్యాలెన్స్ చేస్తుందంటూ ఆది పంచ్ వేసాడు. అక్క‌డితో ఆగ‌ని ఆది.. ఆ తర్వాత మూడంతస్థుల మేడ కట్టారు అంటే వెంటనే ఎందుకు కట్టదు.. ఆమెకు ఈవెంట్‌కు 3 లక్షలు ఇస్తారు.. మాకు లక్ష ఇస్తారంటూ రెమ్యునరేషన్‌పై సెటైర్ వేసాడు. దాంతో వెంటనే అనసూయ నా మీద పడి ఏడుస్తావ్ ఎందుకు ఆది అన్నట్లుగా చూసింది. అలాగే ఆ త‌ర్వాత కూడా ఆదిపై చాలా సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: