ప్రస్తుతం ఏదైనా ట్రెండ్ అవ్వాలంటే అది ఖచ్చితంగా ఫేక్ వార్త అయి ఉండాలి. ఎందుకంటే ఆ ఫేక్ వార్తలు జనాలకు బాగా నచ్చుతాయి.. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరు చదవరు.. అదే ఉన్నది లేనిది అన్ని కలిపి చెప్తే జనాలు విచ్చలవిడిగా షేర్లు చేస్తారు.. చూశారా ఈ వార్తను అంటూ షేర్ చేసేస్తారు.. 

 

ఈ మధ్యకాలంలో అయితే ఆంధ్ర రాజకీయాల్లో ఈ ఫేక్ వార్తలు ఓ రేంజ్ లో కలకలం రేపుతున్నాయి.. సోషల్ మీడియా వచ్చాక అందరికి రాజకీయ వార్తలు అంటే ఇష్టం పెరిగిపోయింది. అందుకే ఏ హామీ ఇవ్వకపోయినా ఇచ్చేసినట్టు.. ఏ విమర్శ చెయ్యకపోయినా చేసినట్టు.. ఎవరు చావకపోయిన ఆ పార్టీ నేత కొట్టడం వల్ల చచ్చారు అంటూ ఫేక్ వార్తలు వచ్చేస్తున్నాయి.. 

 

ఆలా వచ్చిన వార్తలలో ఈసారి ఓ పత్రిక చేసిన ఘనకార్యం బయటపడింది.. ఓ ప్రముఖ తెలుగు దిన పత్రిక బోగస్ వార్తను రాసింది.. ఆ వార్త ఏంటి అంటే? విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని వార్త రాసింది.. ఇక ఆ వార్తకు కొందరు నేతలు ఆహా ఓహో అంటూ మాట్లాడేశారు.. చివరికి ఆ వార్త తప్పు అని తెలుసుకొని పప్పులోకి కాలు వేసినట్టు గుర్తించారు.. 

 

ఇక మరో వార్త ఏంటి అంటే? ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. ఆ సినిమాకు సంబంధించి టైటిల్ ను ప్రకటించారు. ఇంతవరుకు బనే ఉంది.. ఇంకా ఆ తరువాతే ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొన్ని వార్త సంస్దలు ఆ వార్తను రాసి హల్ చల్ చేశారు కూడా.. కానీ చివరికి ఆ వార్త ఫేక్ అని తెలిసింది. ఆ ఫస్ట్ లుక్ ని ఓ ఫ్యాన్ క్రియేట్ చేశాడు అని సమాచారం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలా ఈ రెండు ఫేక్ వార్తలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: