ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 2021 సంవత్సరం జనవరి నెల 8వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా ఎన్టీయార్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఆర్ఆర్ఆర్ దర్శకుడెవరంటే రాజమౌళి అనే చెబుతారు. 
 
కానీ గూగుల్ మాత్రం రాజమౌళికి, ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు రాజమౌళితో పాటు మరో వ్యక్తి కూడా దర్శకత్వం వహిస్తున్నాడని గూగుల్ చూపిస్తోంది. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెర్కెక్కుతోన్న ఈ చిత్రానికి దర్శకుల స్థానంలో గూగుల్ లో రాజమౌళితో పాటు సంజయ్ పాటిల్ అనే మరో వ్యక్తి పేరు కనిపిస్తోంది. 
 

సంజయ్ పాటిల్ ఎవరు..? ఆర్ఆర్ఆర్ సినిమాకు నిజంగానే సంజయ్ పాటిల్ కూడా దర్శకత్వం వహిస్తున్నాడా...? అనే ప్రశ్నలకు సమాధానం కోసం సంజయ్ పాటిల్ గురించి వెతికితే అతనికి సంబంధించిన ఎటువంటి సమాచారం గూగుల్ లో లభించటం లేదు. ఆర్ఆర్ఆర్ కు దర్శకుడిగా రాజమౌళితో పాటు సంజయ్ పాటిల్ పేరు కూడా గూగుల్ చూపించటంపై రామ్ చరణ్ , ఎన్టీయార్ అభిమానులు షాక్ అవడంతో పాటు ఆశ్చర్యపోతున్నారు. 
 
నెటిజన్లు సోషల్ మీడియాలో సంజయ్ పాటిల్ ఎవరో గూగుల్ మాత్రమే చెప్పాలని కామెంట్లు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీయార్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా రికార్డు స్థాయిలో ఆర్ఆర్ఆర్ సినిమాకు బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: