జబర్దస్త్ కామెడీ షో మొదలై ఇప్పటికి ఏడు సంవత్సరాలు అయ్యింది కానీ హైపర్ ఆదికి వచ్చినంత పేరు ఇంత తక్కువ కాలంలో ఒక్క ఆర్టిస్ట్ కి రాలేదన్నది వాస్తవం. సుడిగాలి సుధీర్, చలాకి చంటి యాంకర్లుగా స్థిరపడ్డా హైపర్ ఆది మాత్రం జబర్దస్త్ కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు. అతను చాలా చలాకీగా వేసే పంచులలో స్కిట్ లో భాగంగా ఇతర టీమ్ లీడర్లను జడ్జీలను మరియు యాంకర్లను కూడా టార్గెట్ చేస్తూ ఉంటాడు.

 

అయితే మధ్య కాలంలో యాంకర్ అనసూయ తో అతనికి కెమిస్ట్రీ ఉన్నట్లు.... తన మీద ఇష్టం ఉందని తెలియజేస్తూ వేసే జోకులు బాగానే హిట్ అయ్యాయి. జబర్దస్త్ షో ను రెగ్యులర్ గా చూసేవాళ్ళకి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు కామెడీగానే ఆమెను ఇబ్బంది పెట్టేలా ఆది పంచులు వేసే అది ఈసారి మాత్రం ఏకంగా ఆమెను బుక్ చేసాడు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే అనసూయ ఒక ఈవెంట్ నో హోస్ట్ గా చేసేందుకు మూడు లక్షలు ఛార్జ్ చేస్తుందని అది ఒక స్కిట్ లో భాగంగా అనగా అనసూయ అందుకు ఉడుక్కుంది. ఆది…. అంటూ గట్టిగా అరిచింది. అంతేకాకుండా ఇలాంటి విషయాలు బయట ఇలా ఓపెన్ గా చెప్పేస్తే ఎలా అంటూ ఇబ్బందికరంగా మాట్లాడింది.

 

అనసూయ రెస్పాండ్ అయిన తీరు చూస్తుంటే అది కేవలం జోక్ కాదు అని నిజంగానే కొన్ని గంటలకు మూడు లక్షలు చొప్పున అమె చార్జి చేస్తోందని స్పష్టమవుతోంది. ఎవరైనా కానీ తమ సంపాదనను బయటికి వెల్లడించడానికి ఇష్టపడరు అదీ కాకుండా రోజుకి లక్షలు సంపాదించే సెలబ్రిటీలు అయితే దాని ద్వారా వచ్చే సమస్యలకు దూరంగా ఉండేందుకు ఇలాంటి విషయాలను ఎంతో గోప్యంగా ఉంచుతారు కానీ ఇప్పుడు ఆది అనసూయ సంపాదన విషయం అందరికీ చెప్పేయడంతో ఆమె చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. మొత్తంగా చూస్తే అనసూయ వార్షిక ఆదాయం కోట్ల లో ఉంటుందని స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: