టాలీవుడ్ లో ఏ విషయాన్ని అయినా నిర్మోహమాటంగా చెప్పేవారిలో జగపతిబాబు ముందు వరసలో ఉంటారు. తనకు అలవాట్లు..తాను చేసిన పొరపాట్లు కూడా నిర్మోహమాటంగా వెలిబుచ్చుతారు. ఫ్యామిలీ హీరోగా 1990లలో ఎన్నో చిత్రాలతో మెప్పించిన జగపతిబాబు కాలక్రమేనా క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా మారిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా చిత్రాలు చేస్తున్నాడు జగ్గూ భాయ్. ఇలా హీరో కాదు.. కానీ అంతకంటే కాస్త ఎక్కువే స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈయ‌న‌.  లెజండ్ తో విలన్ గా మారిన జగపతి బాబు తర్వాత వెనుతిరిగి చూసిందిలేదు. 2014లో లెజండ్ విడుదలవ్వగా అప్పటినుండి జగపతి బాబు తీరిక అన్నది లేకుండా నటిస్తూనే ఉన్నాడు. 

 

స్టార్ హీరోలకు తండ్రిగా, వాళ్ళ సినిమాల్లో విలన్ గా కీలక పాత్రలు పోషించాడు జగపతి బాబు. ఒక దశలో జగ్గూ భాయ్ సౌత్ లోనే బిజీ ఆర్టిస్టుగా మారిపోయారు. రంగస్థలం లో ప్రెసిడెంట్ గారు పాత్ర జగ్గూ భాయికి మంచి పేరుకూడా తీసుకొచ్చింది. అయితే ఈ ఏడాది జగపతి బాబు హవా తగ్గిపోయిందేమో అనిపిస్తోంది. ఇక గ‌త ఏడాది కూడా జగపతి బాబు నుండి అంత చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. జగపతి బాబుకు ప్రత్యామ్నాయాలు వెతికే పనిలో దర్శకులు ఉన్నారు. 

 

జగ్గూ భాయ్ ఉంటే రొటీన్ అవుతోంది అనుకుంటున్నారో ఏమో అందుకే బాలీవుడ్ నటులనైనా తెచ్చుకుందామని ఫిక్స్ అయ్యారు. అయినా సీనియర్ తెలుగు హీరో అయి ఉండి.. హ్యాండ్సమ్ లుక్స్ తో హీరోకే పోటీ అనిపించే జగ్గుభాయికి ఇలా ఆఫర్లు తగ్గడం అభిమానులకు మాత్రం రుచించడం లేదు. హిందీ జనాలను దిగుమతి చేసుకోవడానికి బదులుగా జగపతిబాబునే తీసుకోవచ్చుగా  అంటూ రుసరుసలాడుతున్నారు. మరి ఎందుకని జగ్గూ భాయ్ కి సడెన్ గా అవకాశాలు తగ్గిపోయాయన్నది తెలియట్లేదు. మరి ఈ పరిస్థితి నుండి జగపతి బాబు బ్యాక‌ప్ అవుతాడో.. లేదో.. చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: