బాలీవుడ్ నటీమణులలో తమ రాజకీయ అభిప్రాయాలను ధైర్యంగా వెల్లడించే వారిలో స్వరా భాస్కర్ ఒకరని నిర్మొహమాటంగా చెప్పుకోవచ్చు. ఆమె ప్రభుత్వ వైఖరిని పబ్లిక్ గా వ్యతిరేకించిన సందర్భాలు కోకొల్లలు. ఐదారు వారాల క్రితం ఢిల్లీ యూనివర్సిటీలో ముసుగు దుండగుల దాడి జరిగితే... చలించిపోయిన స్వరా భాస్కర్యూనివర్సిటీ విద్యార్థులను పరామర్శించడంతో పాటు ఫీజ్ తగ్గించాలని వారు చేస్తున్న నిరసనకి మద్దతు తెలిపారు. అలాగే మొన్నీమధ్య స్వామి కృష్ణ స్వరూప్ ఒక ప్రసంగం చేస్తూ... ఆడవారు తమ నెలసరి రోజుల్లో వంట చేస్తే వచ్చే జన్మలో కుక్కలాగా పుడతారు అని చెప్పారు. తరువాత ఆ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారమే రేపాయన్న విషయం తెలిసిందే.


అయితే ఒక నెటిజెన్ రెండు కుక్కల ఫోటోలను అప్లోడ్ చేసి స్వామి మాటలను ఎద్దేవా చేసింది. కానీ ఓ బిజెపి ప్రతినిధి ఆ రెండు కుక్కలలో నువ్వు ఎవరంటూ ఆమెని ఘోరంగా అవమానించాడు. దీంతో చిర్రెత్తిన స్వరా భాస్కర్ అతనిని ఎడాపెడా వాయించేసారు. అలాగే ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఎన్నో నిరసనలకు, ఆందోళనలకు దారి తీస్తున్న పౌరసత్వ సవరణ బిల్లు, ఎన్.ఆర్.సి విషయాలపై ఈమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 15 సంవత్సరాల నుండి బాధ్యత గల రాజకీయ కార్యకర్తగా నడుచుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే, నిన్న హిందుస్థాన్ శిఖర్ సమాగం అనే కార్యక్రమంలో స్వరా పాల్గొన్నారు. ఆ సందర్భంలోనే యాంకర్ రుబికా స్వర భాస్కర్ చేసిన 15ఏళ్ల కార్యకర్త కామెంట్ గురించి అడిగారు. 2010లో NPR కలెక్టడ్ డేటా గురించి మీ రియాక్షన్ ఏంటి అని ప్రశ్నించగా... 2010లో నాకు 15 సంవత్సరాలు. అలాగే నేను 15 సంవత్సరాల నుండి కార్యకర్తగా బాధ్యతలు తీసుకుంటున్నాను అని పప్పులో కాలేశారు. ఒకవేళ స్వరా భాస్కర్ కి 2010లో 15 సంవత్సరాలు ఉంటే 2020 నాటికి ఆమెకు 25ఏళ్లు వస్తాయి. కానీ వాస్తవానికి ఆమె వయసు 31 సంవత్సరాలు. అయితే ఆమె చెప్పిన ప్రకారం ఆమెకు 2010-20మధ్య ఉన్న పది సంవత్సరాలలో 16 ఏళ్ళు వచ్చాయన్నమాట. దీంతో నెటిజనులు లెక్కలు రాని ఆమెపై సెటైర్లు వేస్తూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. గణితశాస్త్రంలో స్వరా భాస్కర్ దిట్ట అని చాలామంది ఎద్దేవా చేస్తున్నారు. అయితే స్వరా భాస్కర్ ని ట్రోల్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. అలానే తనని ట్రోల్ చేసిన ప్రతిసారీ ఏదో ఒక మంచి కౌంటర్ ఇవ్వకుండా స్వరా ఉండలేరు. మరి ఈసారి ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలిక.

 

మరింత సమాచారం తెలుసుకోండి: