ఈ రోజుల్లో పిల్ల‌ల్ని క‌న‌డం పెంచ‌డం అనేది ఓ పెద్ద ప‌నిలాగా అయిపోయింది నేటి త‌రానికి. అందులోనూ సెల‌బ్రెటీల విష‌యానికి వ‌స్తే ఆ ప్ర‌భావం మ‌రి కాస్త ఎక్కువ‌గానే క‌న‌ప‌డుతుంది. ఇక ఒక‌రు లేదా ఇద్ద‌రు పిల్లల్ని క‌ని ఆపేస్తున్నారు. ఇద్ద‌రు కూడా క‌ష్టం అనుకునేవాళ్ళు ఒక‌ళ్ళ‌తోనే ఆపేస్తున్నారు. మ‌రి అలాంటి ప‌రిస్థితి ఉన్న త‌రుణంలో ఒకొక్క‌రు ఇద్ద‌రు, ముగ్గురుని క‌న్న టాలీవుడ్ సెల‌బ్రెటీల గురించి మ‌నం ఈరోజు తెలుసుకుందాం...

 

చిరంజీవితో పాటు అనేక మంది హీరోలతో జట్టు కట్టి హిట్ ఫేర్ గా ముద్ర వేసుకున్న నటి మాధవి అందరికీ గుర్తుండే ఉంటుందికొద్ది కాలం తెలుగుతో పాటు కొన్ని ప్రాంతీయ భాషల సినీ రంగాలను ఏలారు అప్పట్లో చిరంజీవి-మాధవి హిట్ పెయిర్ గా పేరొందారు వారిరువురు కలిసి నటించిన ఖైదీ, చట్టానికి కళ్లులేవు కోతల రాయుడు దొంగ మొగుడు ఇంట్లోరామయ్య వీదిలో కృష్ణయ్య తదితర సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాయి. మ‌రి ఆమె నటి భర్త రాల్ఫ్ శర్మ జగన్ తో  వివాహం జ‌రిగింది. ఆమెకి ముగ్గురు ఆడ‌పిల్ల‌లు. టిఫ్పానిశర్మ, ప్రిసిల్లా శర్మ, ఎవెలిన్ శర్మ. ముగ్గురిని ముచ్చ‌ట‌గా క‌నింది.

 

రాధ అప్ప‌ట్లో చిరంజీవితో స‌హా క‌లిసి అంతే ఫాస్ట్‌గా డాన్స్ చేయ‌గ‌ల న‌టి. త‌న అద్భుత‌మైన న‌ట‌నే కాక మంచి డ్యాన్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంది. చిరంజీవి, రాధ కాంబినేష‌న్ అంటే సినిమా ఎలా ఉన్నా కేవ‌లం వీరిద్ద‌రి డ్యాన్స్‌, పాట‌ల కోస‌మే చాలా మంది వీరి సినిమాలు చూడ‌టానికి వెళ్ళేవారు. మ‌రి 
హీరోయిన్ రాధ‌కి కూడా ముగ్గురు పిల్ల‌లు ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు, ఒక మ‌గ‌పిల్లాడు. వారిని ఇండ‌స్ట్రీలోకి తీసుకురావాల‌ని ఆశ‌ప‌డింది. కూతురు హీరోయిన్‌గా వ‌చ్చిందికాని  పెద్ద‌గా హిట్ కాలేక‌పోయింది.

 

రంభ ఒక‌ప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపింది ఈ భామ‌. అగ్ర‌క‌థానాయ‌కులంద‌రితో న‌టించి మెప్పించింది. ఈమె ముగ్గురు బిడ్డ‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు ఒక మ‌గ‌పిల్లాడు. ఆ త‌ర్వాత రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజుకి మొద‌ట్లో పిల్ల‌లు లేరు. ఆ త‌ర్వాత ముగ్గురు ఆడ‌పిల్ల‌లు పుట్టారు.  ఇక క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూడా ముగ్గురు పిల్ల‌ల‌ను క‌న్నారు. ఇద్దరు మ‌గ‌పిల్ల‌లు, ఒక ఆడ‌పిల్ల‌. అయితే వీరు ముగ్గురు కూడా సినిమాల్లోకి వ‌చ్చారు. కానీ ఎవ్వ‌రూ పెద్ద‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు మాత్రం సంపాదించ‌లేక పోయారు. త‌ర్వాత మంచు విష్ణు కూడా న‌లుగురు పిల్ల‌ల్ని క‌న్నారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా మొద‌టి భార్య రేణు దేశాయ్‌కి ఇద్ద‌రు పిల్ల‌లు, త‌ర్వాత చేసుకున్న రెండో భార్య‌కు కూడా ఇద్ద‌రు పిల్ల‌లు ఒక పాప, బాబు ఇద్ద‌రు పుట్టారు అంటే మొత్తం న‌లుగురు బిడ్డ‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. శ్రీ‌కాంత్ ఊహ‌కి కూడా ముగ్గురు పిల్ల‌లు ఒక పాప‌, ఇద్ద‌రు బాబులు ఉన్నారు. హీరో వెంక‌టేష్‌కి కూడా న‌లుగురు పిల్ల‌లున్నారు. ముగ్గురు ఆడ‌పిల్ల‌లు ఒక మ‌గ‌పిల్లాడు ఉన్నాడు.  బాల‌కృష్ణకు  ముగ్గురు పిల్ల‌లు.

మరింత సమాచారం తెలుసుకోండి: