టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు తనయుడు డి సురేష్ బాబు తనయుడు రానా ‘లీడర్ ’ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రానా నటించిన సినిమాలు పెద్దగా విజయాలు అందుకోకపోయినా ఈ హీరో మాత్రం ఎలాంటి ఇబ్బంది పడకుండా.. ఎలాంటి పాత్రలకైనా తాను రెడీ అంటూ ముందుకు సాగుతున్నాడు. కేవలం హీరో చట్రంలో పడిపోకుండా ఎలాంటి క్యారెక్టర్ పాత్రలకైనా ఓకే చెబుతూ ముందుకు సాగుతున్నాడు. బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఆ మద్య రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి, బాహుబలి 2 ’ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ హీరోగా నటించినా.. రానా ఈ చిత్రంలో విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
రానా ప్రస్తుతం హాతీ మేరీ సాతీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ బాగా ఆకట్టుకుంది. అడవిలో ఏనుగులను కాపాడే ఓ యువకుడి పాత్రలో రానా కనిపిస్తున్నాడు. అంతే కాదు ఈ చిత్రం తర్వాత ప్రతిష్టాత్మకంగా విరాట పర్వం లైన్ లో ఉంది. ఆ తర్వత గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య కశిప చిత్రాానికి రెడీ అవుతున్నాడు. అంతే కాదు తేజ దర్శకత్వంలో నేనే రాజు నేను మంత్రి చిత్రంలో నటించి మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో మరో చిత్రానికి రెడీ అవుతున్నాడు. మొత్తానికి ఈ ఏడాది రానాకు బాగానే కలిసి వచ్చేలా ఉన్నాయి. ఒకవేళ ఈ చిత్రాలు గనక హిట్ టాక్ తెచ్చుకున్నాయంటే మనోడికి బాగానే కలిసి వస్తుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
తెలుగు లో ఇప్పటి వరకు వారసత్వపు హీరోలు అతి కొద్ది మందే మంచి సక్సెస్ సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో రానా కి సక్సెస్ లు కలిసి రాకపోవడంతో ఆయన కెరీర్ ముగిసి పోతుందని అనుకున్నారు. బాహుబలి తర్వాత మంచి విజయాలు అందుకుంటున్న రానాకి టాలీవుడ్ లో మంచి భవిష్యత్ ఉండబోతుందని అంటున్నారు. అంతే కాదు మల్టీస్టారర్ చిత్రాలకు కూడా రానా ఎప్పుడూ ఒకే అంటున్న విషయం తెలిసిందే.