జ‌న‌ర‌ల్‌గా ఫిల్మ్‌స్టార్ పిల్ల‌లంటే బార్న్ విత్ గోల్డ్ స్పూన్స్ అంటారు. అంత యాక్టివ్‌గా ఉండ‌టం. అంద‌రితో క‌లివిడిగా మాట్లాడ‌టం కాస్త త‌క్కువ‌గా ఉంటాయి. కానీ స్టార్ హీరో మ‌హేష్‌బాబు న‌మ్ర‌త‌ల ముద్దుల కూతురు సితార మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే గూగుల్‌లో త‌న‌కంటూ ఓ పేజ్ క్రియేట్ చేసుకోగ‌లిగింది. అయితే అందుకు కార‌ణం కేవ‌లం మ‌హేష్‌బాబు కూతురుగా పుట్ట‌డ‌మే కాదు. త‌న ఎనర్జీ లెవ‌ల్స్ త‌న చ‌లాకీత‌నం అనేది త‌న బార్న్ టాలెంట్‌. సితార‌కి అన్నిటికంటే ఇష్ట‌మ‌యిన‌ది డాన్స్‌. సితార మూడేళ్ళ వ‌య‌సునుంచే డాన్స్‌లో దిట్ట‌. 2015 సినిమా అవార్డులో మ‌హేష్‌తోపాటు స్టేజ్ మీద‌కు వెళ్ళిన సితార మ్యూజిక్ విన‌గానే డ్యాన్స్ చేయ‌డం మొద‌లుపెట్టింది. ఇక ఆగ‌డు సినిమాలో తూ ఆజా స‌రోజా సాంగ్ షూట్ చేస్తున్న‌ప్పుడు లొకేష‌న్‌కి మ‌హేష్ ఫ్యామిలీ కూడా వ‌చ్చింది. ఇక అక్క‌డ  మ‌హేష్ కంటే ముందు సితార డ్యాన్స్ చేసి క్రూ అంద‌రికీ ఫుల్ జ్యోష్ ఇచ్చింది. అలాగే ఈ మ‌ధ్య స్కూల్ యానివ‌ర్స‌రీ ఫంక్ష‌న్లో కూడా డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టింది సితార‌. శ్రీ‌మంతుడు సినిమాలోని రామ రామ సాంగ్‌కి డ్యాన్స్ వేసిన‌ప్పుడు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఇక ఇటీవ‌లె విడుద‌లైన స‌రిలేరు చిత్రంలో స‌మంత స్పెష‌ల్ సాంగ్‌కి కూడా సితార స్టెప్పులు యాజిటీజ్ దించేసింది. డ్యాంగ్ డ్యాంగ్ అంటూ వ‌చ్చే సాంగ్‌కి సితార సూప‌ర్ డ్యాన్స్ చేసింది.

 

అయితే సితార‌లో కేవ‌లం డ్యాన్సింగ్ ట్యాలెంట్స్ మాత్ర‌మే కాదు చాలా హిడెన్ ట్యాలెంట్స్ కూడా ఉన్నాయి. ప్లే స్కూల్లో జాయిన్ అయిన కొత్త‌ల్లోనే పాట్ మేకింగ్‌లో ఎక్స్‌ప‌ర్ట్ అయిపోయింది. అలాగే సితార మంచి చెఫ్ కూడా ఫ్యామిలీ మెంబ‌ర్స్ కోసం మంచి చాక్లెట్ కూడా త‌యారు చేస్తోంది. ఇక త‌న‌కోసం నూడుల్స్ కూడా త‌యారు చేసుకుంటోంద‌ట‌. మ‌హేష్‌కి ఎక్కువ‌గా ఒంట‌రిగా ఉండ‌టం ఇష్టం. కానీ ఆయ‌న కూతురు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇప్ప‌టి నుండే ఫ్రెండ్స్ గ్యాంగ్‌ని మెయిన్‌టెయిన్ చేస్తోంది. అలాగే త‌న ఫ్రెండ్స్ అంద‌రికీ త‌న పుట్టిన‌రోజునాడు ఇంట్లోనే గ్రాండ్ పార్టీ ఇచ్చింది. 

 

ఇక గౌత‌మ్ కాస్త కామ్‌గా ఉంటాడు. అందుకే అత‌ని అల్ల‌రి కూడా సితారే చేస్తోంద‌ట‌. ఇల్లంతా స‌ర్ది సైలెంట్‌గా ఉందంటే సితార ప‌డుకుని ఉంద‌ని మ‌హేష్ చెప్ప‌డం విశేషం. ఇక ఎంత అల్ల‌రి చేసిన త‌న అమాయ‌క‌మైన చూపుల‌కి ఏమీ అన‌బుద్ధి కాదు అంటున్నారు మ‌న సూప‌ర్ స్టార్‌. అయితే మ‌హేష్‌కి మాత్రం సితార సినిమాల్లోకి రావ‌డం ఇష్టం లేదు ఆమెను లాయ‌ర్ గా చూడాల‌ని కోరిక. సితార‌ని న‌మ్ర‌త కంట్రోల్‌లో పెడుతుంది. అందుకే నాన్న‌కూచిగా మారింది సితార‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: