అనుష్క‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవి అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఈ భామ అంత పాపుల‌ర్. దేవసేన, భాగమతి, జేజమ్మ.. అగ్ర కథానాయిక అనుష్క పేరు చెబితే గుర్తొచ్చే పాత్రల పేర్లు ఇవి. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోవడం ఈ బెంగళూరు భామ స్పెషాలిటీ. అక్కినేని నాగార్జున నటించిన 'సూపర్' అనే సినిమాతో కెరీర్ ఆరంభించిన ఈ అమ్మడు.. మొదట గ్లామరస్ పాత్రలకే పరిమితం అయింది. ఆ తర్వాత తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటినే చేసుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలోనే మంచి పేరును సంపాదించడంతో పాటు స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 

 

ఇక ఈ స్వీట్ గర్ల్ అనుష్క శెట్టి ఇండస్ట్రీలో అడుగుపెట్టి పద్నాలుగేళ్లవుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ డమ్ అందుకుంది. తనదైన అందం, అభినయంతో అభిమానులను మెస్మరైజ్ చేయడం అనుష్క స్టైల్‌. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తున్న అనుష్క మార్కెట్ స్థాయి కూడా పెరుగుతోంది. అయితే బాహుబలి తర్వాత ఇప్పటివరకూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు కాకుండా ఒక రెగ్యులర్ హీరో ఓరియంటెడ్ సినిమాలో హీరోయిన్ గా నటించలేదు. 

 

పైగా ఆ సైజ్ జీరో సినిమా పుణ్యామా అని బరువు పెరిగిన స్వీటీ ఇప్పటి వరకూ ఆ రోజుల్లో ఉన్నట్టుగా స్లిమ్ గా.. ఫిట్టుగా కనిపించడం లేదు. దీనిపై అభిమానులు కాస్త అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈమధ్య అనుష్క గ్లామరస్ గా కూడా కనిపించడం లేదు. దీంతో అభిమానులు శాస్త్రవేత్తల తరహాలో పాత ఫోటోలు అంతర్జాలం అంతా గాలించి కత్తి లాంటి స్వీటీ ఫోటోలను వెలికి తీసి మరీ వైరల్ చేసే పనిలో పడ్డారు. ఇక పైన కనిపిస్తున్న ఫోటో కూడా అలాంటివే. నిజంగా ఆ ఫోటో చూస్తుంటే చూపు తిప్పుకోలేక‌పోతున్నారు. సాధారణ ప్రవర్తన ఉన్న ఏ మగానుభావుడికైనా ఈ ఫోటో చూస్తే జివ్వనిపించక మానదు. 

 

అంత‌లా ఉంది స్వీటీ ఫోటో మరి. కాగా, చాలా గ్యాప్‌ తీసుకున్న అనుష్క త్వరలో నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. వస్తాడు నా రాజు ఫేం హేమంత మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లోనూ రూపొందిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మాధవన్‌, అంజలి, షాలిని పాండేలతో పాటు హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌ మ్యాడ్సన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: