నయనతార తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్న తేడా లేకుండా టోటల్‌గా దక్షిణాదిలోనే టాప్ హీరోయిన్. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. అయితే కెరీర్ ఆరంభంలో మలయాళంలో ఓ టీవీ షోలో యాంకరింగ్ చేసుకొన్న‌ నయనతార ఈరోజు దక్షిణ భారతదేశం గర్వించదగ్గ టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు రు. 4 నుంచి 6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అయితే నయనతార ప్రవర్తనపై అన్ని ఇండస్ట్రీలోనూ చాలా కంప్లెంట్లు ఉన్నాయి. ఆమెకు పొగరు ఎక్కువ అన్న‌దే ప్ర‌ధాన ఆరోప‌ణ‌.



ఆమె సినిమాల‌లో నటించిన ప్రమోషన్లకు మాత్రం రావడంలేదని అంద‌రు అంటుంటారు. తాను ప్రమోషన్లకు రాన‌న్న‌ కండిషన్లు ముందే పెడుతుందని... ఆమె తీరుతో అగ్ర హీరోలు దర్శకనిర్మాతలు సైతం చాలా ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు ఎప్పటినుంచో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవే కాదు... సూప‌ర్‌స్టార్‌ రజినీకాంతే కాదు.. ఏ హీరో అయినా నయనతార మాత్రం ప్రమోషన్స్ కి రాదు. ఎవరేమనుకున్నా నయనతార మాత్రం మారదు ఇది ఫిక్స్.



అయితే ఇప్పుడు ఆమె ల‌వ‌ర్ విఘ్నేష్ శివ‌న్ తీసే సినిమా ప్ర‌మోష‌న్ల‌లో మాత్రం ఆమె బిజీ బిజీ కానుంద‌ట‌. ఈ సినిమాలో నయనతారసమంత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సమంత మాత్రం సినిమా షూటింగ్ కి ఎంత పక్కనో.. ప్రమోషన్స్ కి కూడా అంతే పక్కా ఉంటుంది. అయితే న‌య‌న‌తార షూటింగ్ వ‌ర‌కే ప్ర‌మోష‌న్ల‌కు మాత్రం రాదు.



ఇక తాజాగా న‌య‌న్ ల‌వ‌ర్ విఘ్నేష్ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. నయనతారసమంత వార్ టీజర్ తో సినిమా క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమా కోసం న‌య‌న‌తార భారీ ఎత్తున ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొన‌బోతోంద‌ట‌. అయితే ప్రియుడి కోసం ఒక‌లా.. బ‌య‌ట స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్ల కోసం మ‌రోలా ఆమె బిహేవ్ చేస్తుండ‌డంతో ఆమె స్వార్థ‌ప‌రురాలంటూ.. ఆమె తీరుపై ఇప్పుడు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. మ‌రి న‌య‌న్ త‌న తీరు మార్చుకుంటుందో ?  లేదో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: