ఇటీవల కాలంలో త్రిష సినిమాలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. పెళ్లి పీటల వరకు వెళ్లి వెనక్కి వచ్చిన తరువాత త్రిష సినిమాల ఎంపికలో చాలా మార్పు కనిపిస్తోంది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో పాటు ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు, బోల్డ్‌ క్యారెక్టర్స్‌ చేస్తోంది త్రిష. తాజా ఈ చెన్నై చంద్రం మరో వివాదంలో చిక్కుకుంది. దక్షణాదిలో త్రిష దాదాపు 15 ఏళ్లకు పైగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.


తన కెరీర్ పరంగా త్రిషకు ఎప్పుడూ నటిగా ఫెయిల్‌ కాలేదు. తాజాగా త్రిష పై తమిళ నిర్మాత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.  త్రిష నటించిన 60వ చిత్రం 'పరమపదం విళైయాట్టు'. తిరుజ్ఞానం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫిబ్రవరి 28న రిలీజ్ చేస్తున్నారు. దీనితో చెన్నైలోని సత్యం థియేటర్ లో శనివారం ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రమోషనల్ ఈవెంట్ లో కోలీవుడ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ శివ, త్రిష పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 

రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి టాప్‌ స్టార్లే సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కానీ హీరోయిన్లు మాత్రం ప్రచారానికి రావటం లేదు. సినిమా ప్రచారం కూడా హీరో హీరోయిన్ల బాద్యతే కదా, వారు సినిమాను అలా వదిలేయం కరెక్ట్ కాదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నటించటంతో పాటు ప్రచారంలోనే భాగమవుతారనే నటీనటులను దర్శక నిర్మాతలు ఎంచుకుంటారు. కానీ ఈ జనరేషన్‌లో చాలా మంది హీరోయిన్లు ప్రచారానికి రావటం లేదు. ఇక మీదట ప్రమోషన్‌ కార్యక్రమాలకు రాని హీరోయిన్లను బ్యాన్‌ చేస్తాం అన్నారు. ముఖ్యంగా త్రిష తాజా చిత్రం విషయంలో ఆమె ప్రచారానికి హాజరు కాకపోతే ఆమె పారితోషికంలో సగం తిరిగి ఇచ్చేయాలని శివ వార్నింగ్ ఇచ్చాడు. అయితే నయనతారా చాలా కాలంగా తాను నటించిన సినిమాల ప్రమోషన్‌కు రావటం లేదు. గతంలోనూ నయన్‌ వ్యవహారం చర్చకు వచ్చింది. మరి శివ ఇప్పుడు నయన్‌కు కూడా ఇదే స్థాయిలో వార్నింగ్‌ ఇస్తాడా అన్న ప్రశ్న తలెత్తుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: