ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో పబ్లిసిటీ పొందాలనుకునే బాలీవుడ్ భామ సోఫియా హయత్‌. గతంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రకరకాల వార్తలు చెప్తూ వార్తల్లో నిలిచిన ఈ భామ ఇటీవల సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌ అయ్యింది. వరుసగా హాట్ హాట్‌ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అదే సమయంలో తనను తాను ఓ దైవాంశ్య సంభూతురాలిగా చూపించేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో తన న్యూడ్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన సోఫియా ఇప్పుడు మరో వివాదానికి తెర తీసింది.

 

తాజాగా తనని తాను కాళీ మాతగా చూపిస్తూ ఓ ఫోటోను మార్ఫ్‌ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలపై కొంత మంది అభిమానులు పాజిటివ్‌ గానే స్పందించినా.. ఎక్కువ మంది మండిపడుతున్నారు. `నీకసలు బుద్దుందా.. ఇది హిందూ దేవతలకు అవమానం. నీ స్థాయి ఏంటో తెలుసుకో` అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది మరో అడుగు ముందుకేసి నగ్న ఫోటోలు పెట్టే నువ్వు ఇలాంటి పనులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

I am Quan Uon...I am Sofia...I am Isis...I am Shakthi...I am Kali. Thankyou to By devotee @sofiasm2020 #goddess #egypt #ayahuasca #dmt #spiritmolecule #shiva #awakening

A post shared by Sofia Hayat (@sofiahayat) on

మరింత సమాచారం తెలుసుకోండి: