టాలీవుడ్ లో మెగా హీరోల అందరినీ చిరంజీవి నుంచి కళ్యాణ్ దేవ్, వైష్ణవి వరకు మొత్తం ఏకంగా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో చిరంజీవి తర్వాత ఆ రేంజ్ లో పాపులర్ అయింది పవన్ కళ్యాణ్ మాత్రమే. తర్వాత జనరేషన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ హీరోలుగా నిలదొక్కుకున్నారు. ఇక సాయి ధరంతేజ్ సైతం యువ తరం హీరోల్లో తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఏడాది పొడవునా మెగా హీరోలు నటించిన సినిమాలు నెలకు ఒకటి చొప్పున యావరేజ్ గా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇక స్టార్ హీరోయిన్లు సైతం మెగా హీరోలు తమ సినిమాల్లో వరుసబెట్టి రిపీటెడ్ చేస్తూనే ఉన్నారు.

 

ఇదిలా ఉంటే ఇప్పటికే పలువురు మెగా హీరోల పక్కన పెట్టి నటిస్తూ సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ తన సినిమాలు నటింపచేయాలని మెగాహీరో ప్రయత్నాలు చేస్తున్నాడట. ప్రస్తుతం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఆ మెగా హీరోసినిమా కంప్లీట్ అయ్యాక  త‌ర్వాత నటించే సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్ తన పక్కన ఉండాలని ఇప్పటికే తన దగ్గరకు కథలు చెప్పేందుకు వస్తున్నా దర్శకులకు ఓపెన్‌గానే చెప్పేస్తున్నాడట. ఆ హీరోయిన్ ఈసారి తన సినిమాలో కచ్చితంగా ఉండాల్సిందేనని చెపుతుండడంతో దర్శక నిర్మాతలు ఎవరు అభ్యంతరం పెట్టేందుకు కూడా సాహసించడం లేదట. ఇప్పటికే ఆ హీరోయిన్ రేటు రెండు కోట్ల పై మాటే ఆయన సదరు మెగాహీరో ముచ్చట పడుతుండటంతో కథాకథనాలు ఇంకా ఓకే అవ్వకపోయినా సినిమా ఫైనల్ కాకపోయినా ఈ కండిషన్‌కు  మాత్రం ఒప్పుకోక త‌ప్ప‌టం  లేదట.

 

మ‌రి కొన్ని సంద‌ర్భాల్లో హీరోలు చెప్పిన‌ట్లు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు విన‌క త‌ప్పదు. వాళ్ళతో సినిమాలు చేయాలంటే వాళ్ళ కండీష‌న్స్ ఖ‌చ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మ‌రి ఇలాంటి సంద‌ర్భంలో ఆ హీరోయిన్ ఆ పాత్ర‌కి సెట్ అవుతుందా లేదా అన్న విషయాలు కూడా చూడాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: