టాలీవుడ్ లో తెలుగు హీరోలను దేవుళ్ళు మాదిరి గా చూస్తారు అభిమానులు. దీనితో వారికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వాళ్ళు అభిమానిస్తారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే మన తెలుగులో హీరోయిన్లు ఇతర నటుల కంటే హీరోలకే ఎక్కువగా హవా ఉంటుంది అనేది వాస్తవం. ఇది హీరోలకు మార్కెట్ పరంగా కూడా బాగానే కలిసి వస్తుంది అనే చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసే సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో వసూళ్లు కూడా బాగానే ఉంటున్నాయి. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు యాడ్స్ లో తమకు ఉన్న ఫాలోయింగ్, గ్లామర్ తో హడావుడి చేస్తున్నారు మన హీరోలు. ముఖ్యంగా అల్లు అర్జున్, మహేష్ బాబు, నాగార్జున ,జూనియర్ ఎన్టీఆర్, అయితే కీలక యాడ్స్ లో నటిస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం మూడు నుంచి 5 యాడ్స్ లో కనపడుతున్నాడు. దీనికి తోడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి కూడా ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు.  జూనియర్ ఎన్టీఆర్ కూడా రెండు మూడు యాడ్స్ లో నటిస్తున్నారు. ఇప్పుడు కూడా మహేష్ బాబు చేతిలో దాదాపు అరడజన్ యాడ్స్ పైనే ఉన్నాయి. 

 

ఈయన కోసం కార్పోరేట్ కంపెనీలు కూడా క్యూ కడుతున్నాయి. పైగా మహేష్ బాబుకు తమిళనాట ఫాలోయింగ్ ఉంది. దీనితో అక్కడ కూడా ఇలాగే ఆయన యాడ్స్ తో దూసుకుపోతున్నారు. రానా, వెంకటేష్ లాంటి హీరోలు కూడా యాడ్స్ చేస్తున్నారు. వీటి ద్వారా భారీగా ఆదాయాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. తమకు ఉన్న ఫాలోయింగ్ ని ఈ విధంగా వాడుకుంటున్నారు హీరోలు. ఒక పక్క సినిమా వ్యాపారంలో దూసుకుపోతున్న హీరోలు, ఇలా యాడ్స్ లో కూడా తమ సత్తా చాటుతూ బుల్లి తెర మీద కూడా సందడి చేస్తున్నారు మన స్టార్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: