మాములుగా ఒక ప్రేమ్ లో ఒక్క హీరో కనిపెడితేనే ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు అలాంటిది.. ఒక ప్రేమ్ లో ముగ్గురు అకస్మాత్తుగా కనపడిన కూడా ఇంకా ఫ్యాన్స్ ఆగుతారా.. సమస్యే లేదు.. అది కూడా స్టార్ హీరోలైతే ఇంకా విషయంలో రచ్చ ఓ రేంజులో ఉంటుంది. మిగిలిన సినీ ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో ఈ హంగామా కాస్త ఎక్కువనే చెప్పాలి. 

 


తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువే.. అలాగే ఒకరిపై మరొకరికి అమితమైన అభిమా,అభిమానం కూడా ఎక్కువే.. అందుకే ఒకరి సినిమా విడుదల అవుతుంది అంటే మరో హీరో సందడి చేసి సినిమాకు ప్రమోషన్ చేస్తారు. ఇటీవల కాలంలో పెద్ద స్టార్లు సైతం చిన్ని హీరో సినిమా ప్రమోషన్లో జోరుగా పాల్గొంటారు. అలా సినిమాలను ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. 

 


అయితే టాలీవుడ్ హీరోల మధ్య సత్సంబంధాలు ఎక్కువగానే ఉంటాయి. టాలీవుడ్ లో చాల మంది హీరోలు ఒకరితో మరొకరు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇక టాలీవుడ్ టాప్ హీరోలుగా కొనసాగుతున్న మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మధ్య మంచి సాన్నిత్యం ఉన్న సంగతి తెలిసిందే . ఖాళీ సమయాలలో ఈ హీరోలు తమ కుటుంబాలతో కలిసి ప్రైవేట్ పార్టీలలో కూడా పాల్గొంటూ ఉంటారు. అలాగే మహేష్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో చరణ్, తారక్ లతో లాంగ్ రైడ్ కి వెళ్ళడానికి ఇష్టపడతాను ని చెప్పుకొచ్చారు.ఆ మాటలు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టాయి. 

 

 

విషయానికొస్తే.. ఈ ముగ్గురు కలిసినపుడు దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎవరో జోక్ వేయగా ముగ్గురూ గట్టిగా నవ్వుతున్న ఆ ఫోటో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో పాల్గొంటుండగా, మహేష్ ఇటీవలే అమెరికా ట్రిప్ ముగించుకొని వచ్చారు.ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: