తెలుగు హీరోయిన్లను అంటే గ్లామర్ షోకు దూరంగా ఉంటారన్న పేరుంది. అందుకే తెలుగమ్మాయిలకు అవకాశాలు రావన్న అపవాదు కూడా ఉంది. అయితే తెలుగమ్మాయినే అయిన గ్లామర్ షోకు మాత్రం ఆల్ వేజ్ రెడీ అంటూ స్పైసీ ఫోటో షూట్లతో అలరిస్తున్న బ్యూటీ ఇషా రెబ్బా. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. బందిపోటు, అమీ తుమీ లాంటి సినిమాల్లో నటించినా ఈ బ్యూటీ అనుకున్న స్ధాయిలో గుర్తింపు రాలేదు.
అయితే తనకు అవకాశాలు రాకపోవడానికి కారణం తాను తెలుగమ్మాయిని కావటమే అంటూ చాలా సార్లు ఆవేదన వ్యక్తం చేసింది ఈషా. ఐతే నాని నిర్మాణంలో తెరకెక్కిన అ, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ సినిమాల్లో చేసిన పాత్రలకు ఈషాకు మంచి పేరే వచ్చింది. ఆ తర్వాత రాగల 24 గంటల్లో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో చేసినా మరోసారి నిరాశే ఎదురైంది.
ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. ఈషా నటనను చూసిన ఓ బాలీవుడ్ నిర్మాత... ఆమెకు ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆఫర్ ఇచ్చాడట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. నేషనల్ అవార్డ్ అందుకున్న రాజ్‌సింగ్ చౌదరి దర్శకత్వంలో ఉమెన్ ఎంపవర్మెంట్ నేపథ్యంలో తెరకెక్కే ఆ సినిమాలో ఓ రాజస్థానీ అమ్మాయి పాత్రను ఈషా రెబ్బా పోషించనుంది. సోనమ్ కపూర్ తమ్ముడు హర్షవర్ధన్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో మరింత హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తోంది ఈషా. తాజాగా బ్యాక్ చాలా వరకు ఓపెన్ ఉన్న బ్లాక్ డ్రస్‌లో ఈషా తీయించుకున్న ఓ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది.