ఒక సినిమాను దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు అంటే... అతని మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. సినిమాలో ఆ సీన్ ఇలా ఉండాలి. ఈ సీన్ ఇలా ఉండాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా సినిమాలో ప్రతీ సన్నివేశంలో ఏ నటుడు ఉండాలి. ఏ సీన్ ఎక్కడ పడితే ఏ విధంగా ఉంటుంది...? సినిమాకు ప్లస్ అయ్యే అంశాలు ఎం ఉంటాయి...? ఏయే మార్పులు చేస్తే కథ బాగుంటుంది...? అనే చాలా ఆలోచనలతో దర్శకుడు సినిమా చేస్తూ ఉంటాడు. అంత వరకు బాగానే ఉంది గాని...

 

ఇప్పుడు హీరోల రూపంలో దర్శకులకు పెద్ద కష్టం వచ్చి పడింది. కొందరు హీరోలు దర్శకులు చెప్పినట్టు చేస్తుంటే మరికొందరు హీరోలు దర్శకులు చెప్పిన దానికి భిన్నంగా చేస్తున్నారు. కథ తమకు నచ్చిన విధంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ ఇమేజ్ కి తగిన విధంగా కథను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా బాక్సాఫీస్ వద్ద వరల్డ్ ఫేమస్ రాడ్ అయింది అంటే అదే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఇదే తంతు చేస్తున్నారు. 

 

పాట ఇలా ఉండాలి... ఫైట్ ఇలా ఉండాలి అంటూ అనవసర సలహాలు ఇస్తున్నారు. దర్శకుడు స్క్రీన్ ప్లే ప్లాన్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కాని పులిహోర సలహాలు ఇచ్చి సినిమాను బంగాళాఖాతం లో కలిపేస్తున్నారు. అగ్ర దర్శకులు కూడా ఈ సమస్య ను ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. ఎన్ని విధాలుగా ఎదురు దెబ్బలు తగులుతున్నా హీరోలు మాత్రం మారడం లేదు. దీనితో స్టార్ హీరోలతో సినిమాలు చేసే ముందు మానసికంగా సిద్దపడే ఉంటున్నారు దర్శకులు. కొంత మంది దర్శకులు అయితే మాకు ఇదేం ఖర్మ అంటూ బాధపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: