ఒకప్పుడు వివాదాలు అంటే ఏవి ఉండేవి.. కానీ ఇప్పుడు వివాదం అంటే పెట్టిన ట్విట్లలోనో.. లేకపోతే ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పోస్టుకు ఓల్గార్ కామెంట్ రావడమో... ఇలా ఏవో పిచ్చివి వస్తే తప్ప అవి వివాదాలు అని తెలియదు. వీళ్ళు రియాక్ట్ అవుతే తప్ప అది వివాదంగా మారదు.. ఇకపోతే ఈ వారం వివాదం తెచ్చిన ట్విట్లు ఏవో ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

ఈ వారం అంతగా వివాదం తెచ్చిన ట్విట్ ఏంటి అంటే రష్మిక ట్విట్ ఏ.. పాపం.. పాప నటించిన సినిమా ఈ వారం విడుదల అయ్యింది. ఆ విడుదలకు ముందే ఆమె ఫోటో షూట్ చేసి కొన్ని అందమైన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో, ఫేసుబూక్ లో షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలు చూస్తే ఎవరైనా సరే సూపర్ అని అంటారు.. 

 

అలానే రష్మిక ఫోటోలకు అందరూ స్పందిస్తున్నారు.. వావ్.. సూపర్.. డూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు... అలా చేసిన కామెంట్లలో రష్మిక ట్విట్టర్ లో ఓ కలెక్టర్ కూడా కామెంట్ చేశాడు.. అందులో ఏముంది ? అతనికి కూడా నచ్చి చేసి ఉంటాడు అని మీరు అనుకోవచ్చు.. కానీ ఆ ట్విట్ లో ఏముంది అంటే ''చించావు పో'' అని ఉంది. 

 

ఒక కలెక్టర్ అయి ఉండి ఇలా కామెంట్ చేశాడు ఏంటి? ఎం పోయే కాలం అని అందరూ ట్విట్స్ పెట్టి తిట్టడం మొదలు పెట్టారు. ఇది చుసిన కలెక్టర్.. ఆ ట్విట్ అతను పెట్టలేదు అని.. అతని ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు అని వాపోయాడు.. దీంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఎవరు హ్యాక్ చేశారో కనుక్కునే పనిలో పడ్డారు. ఆ కలెక్టర్ ఎవరో కాదు... జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి. అతనే ఆ వివాదంలో పడ్డాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: