రియాలిటీ షోని రన్ చేయాలంటే షో కాన్సెప్ట్ ఎలాంటిదైనా సరే బుల్లితెర ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయడమే దర్శకుల పని. అందుకోసం ఆ యాంకర్స్ మధ్య రిలేషన్ ఏర్పరచడం.. వాళ్ల కెమిస్ట్రీతో షోని సక్సెస్ బాటలో నడిచేలా చేయడం చాలా కామన్ అయ్యింది. షో చేస్తున్నప్పుడు పెళ్లైన అమ్మాయైనా.. పెళ్లి కాని అబ్బాయైనా ఇలా వాళ్ల కెమిస్ట్రీ కోసం కొన్నిసార్లు పరిమితులు దాటాల్సిందే. ఇక అసలు విషయంలోకి వస్తే జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యి.. ప్రస్తుతం షోలో టాప్ రేటెడ్ కమెడియన్ గా ఉన్న హైపర్ ఆది ఆ షో యాంకర్ అనసూయతో మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేస్తున్నాడు.  

 

మొన్నటివరకు ఆది స్కిట్ కు ఓపెనింగ్ సాంగ్ మాత్రమే చేసే అనసూయ ఈమధ్య స్కిట్స్ లో కూడా వాడేస్తున్నాడు. టైం దొరికితే చాలు అనసూయ మీద పంచులేయడం.. ఇష్టం అంటూ బాగా ఉత్సాహం చూపిస్తున్నాడు. ఆఫ్ స్క్రీన్ ఏమో కాని ఆన్ స్క్రీన్ పై ఆది తన మీద చూపిస్తున్న అభిమానాన్ని చూసి పొంగిపోతుంది అనసూయ. అయితే యూట్యూబ్ లో మాత్రం వీళ్లిద్దరి రిలేషన్ పై నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు. ఏదో అనసూయని వాడుకుని ఆది తన స్కిట్లు ఇంకాస్త పేలేలా చేస్తుంటే అనసూయ, ఆదిల మధ్య ఏదో నడుస్తుంది అన్నట్టుగా మీడియా హడావిడి చేస్తుంది.

 

అయితే దీని వల్ల వాళ్లకు వ్యూస్ పెరిగి డబ్బులు వస్తాయేమో కాని హైపర్ ఆది, అనసూయలు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఒకానొక సందర్భంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజం కాదన్న పరిస్థితికి రీడర్స్, ఆడియెన్స్ కూడా వచ్చేశారు. అందుకే ఆది పెళ్లైన అనసూయ వెంట పడుతూ అదే కామెడీ అనుకుంటున్నాడు. ఏదైనా లిమిట్ లో ఉన్నంతవరకు బాగానే ఉంటుంది.. కాని దాన్ని క్రాస్ చేస్తేనే వెగటు పుట్టిస్తుంది. మరి ఆది, అనసూయ ఈ విషయం గురించి కొద్దిగా సీరియస్ గా ఆలోచిస్తే బెటర్.     

మరింత సమాచారం తెలుసుకోండి: