సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా గురించి ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి నెలకొంటుంది  అన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోసినిమా చేయబోతున్నాడు...ఏ  డైరెక్టర్ తో చేయబోతున్నాడు... తమ అభిమాన హీరో సినిమాలో హీరోయిన్ ఎవరు.. ఇలాంటి వాటి గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మెగా అభిమానులు అందరూ రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి అనే దానిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రస్తుతం మెగాపవర్ స్టార్  రామ్చరణ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్  అనే సినిమాలో  జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. 

 

 

 ఇకపోతే ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఏ డైరెక్టర్  తో సినిమా చేయబోతున్నాడు అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఇద్దరు హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్... ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తన తర్వాత ప్రాజెక్ట్ త్రివిక్రమ్ తో ఉంది అని చెప్పకనే చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకునే పనిలో పడ్డారట. ప్రస్తుతం రాజమౌళి సినిమా పూర్తవ్వగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను కూడా పట్టాలెక్కించేయాలనే ఆలోచనలో ఉన్నారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. 

 

 

 ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి సినిమా ఎవరితో అనే దానిపై క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చరణ్ నెక్స్ట్ మూవీ పై వార్తలు వినపడుతూనే ఉన్నాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మనం డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ తో  కలిసి కథ వినిపించాడని.... పూర్తి స్క్రిప్టు సిద్ధం చేయమని రామ్ చరణ్ చెప్పడంతో ఇప్పుడు విక్రమ్ కే కుమార్  స్క్రిప్ట్ను సిద్ధం చేసే పనిలో పడ్డాడు అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం రామ్ చరణ్ ని డైరెక్ట్ చేయబోయే దర్శకుల రేసులో మరో డైరెక్టర్ కూడా చేరిపోయినట్లు తెలుస్తుంది. మరి వీరిలో చరణ్ ఎవరికి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా చేయబోతున్నాడు అనేది తెలియాలంటే వేచిచూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: